Begin typing your search above and press return to search.
లిప్ లాక్ సీన్ కోసం నాన్ వెజ్ మానేసిన హీరో
By: Tupaki Desk | 19 July 2022 12:30 AM GMTహాలీవుడ్ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు.. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు చాలా కామన్ విషయం. ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో ఇప్పటికి కూడా మన ఇండియన్ సినీ సెలబ్రెటీలు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని ఇంగ్లీష్ సినిమాల్లో మాత్రం హీరో హీరోయిన్ చాలా కామన్ విషయంగానే ముద్దు సన్నివేశాన్ని చూస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నటిస్తూ ఉంటారు.
అయితే హీరోకు సిగరెట్ లేదా ఇతర అలవాట్లు ఉండి.. హీరోయిన్ కు అలాంటివి పడకుంటే అప్పుడు అసలు సమస్య వస్తుంది. హీరోయిన్ కు ఇబ్బంది అయినా షూటింగ్ లో భాగంగా కనుక తప్పదు అనుకునే వారు ఎక్కువ శాతం ఉంటారు.
కొందరు హీరోలు మాత్రం ముందే తమ అలవాట్లు ముద్దు సన్నివేశం సమయంలో హీరోయిన్స్ కు ఇబ్బంది కలిగించకూడదు అంటూ మానేసిన సంఘటనలు ఉన్నాయి.
తాజాగా లవ్ అండ్ థండర్స్ సినిమాలో ముద్దు సన్నివేశాల కోసం హీరో నటాలీ పోర్ట్ మన్ మరియు హీరోయిన్ క్రిస్ హేమ్స్ వర్త్ చాలానే కష్టపడ్డారట. ముఖ్యంగా వెజిటేరియన్ అయిన క్రిస్ కి ముద్దులు పెట్టేందుకు నటాలీ పోర్ట్ తనకు ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ కు బ్రేక్ ఇచ్చాడట. ఈ విషయంను స్వయంగా హీరోయిన్ క్రిస్ తాజా ఇంటర్వ్యూలో వెళ్లడించి అందరిని ఆశ్చర్యపర్చింది.
రోజులో అర గంట లేదా గంటకు కొంత మొత్తం చొప్పున ప్రతి రోజు కూడా 4500 కేలరీల మాంసహారం ను తీసుకునే నటాలీ పోర్ట్ ముద్దు సన్నివేశాలు ఉన్న సమయంలో నాన్ వెజ్ కు పూర్తిగా దూరంగా ఉండేవాడట. క్రిస్ కు నాన్ వెజ్ అస్సలే ఇష్టం ఉండదు.. పూర్తిగా వెజిటేరియన్ అయిన క్రిస్ కోసం నటాలీ తన అలవాటును మార్చుకున్నాడట.
షూటింగ్ ఉన్నన్ని రోజులు.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో నటాలీ పూర్తి గా నాన్ వెజ్ కు దూరంగా ఉన్నట్లుగా క్రిస్ వెళ్లడించింది. తాను ఎప్పుడు కూడా ముద్దు సమయంలో వెజ్... నాన్ వెజ్ ప్రస్తావన తీసుకు రాలేదని.. కాని ఆయనే నేను వెజిటేరియన్ అనే విషయాన్ని తెలుసుకుని ముద్దు సన్నివేశాల సమయంలో నాన్ వెజ్ తినలేదని చెప్పుకొచ్చింది.