Begin typing your search above and press return to search.

సమంత కళ్లు చెదిరే కార్లు..వాటి విలువెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   6 May 2020 4:15 AM GMT
సమంత కళ్లు చెదిరే కార్లు..వాటి విలువెంతో తెలుసా?
X
టాలీవుడ్ యాక్టర్ సమంత అంటే తెలియని తెలుగు జనాలు ఉండరు. అక్కినేని వారి కోడలయ్యాక మరింత పాపులారిటీ వచ్చేసింది. టాలీవుడ్లో స్టార్ గా ఎదిగింది. ఏమాయ చేశావో సినిమాతో కుర్రకారు మదితోపాటు హీరో నాగచైతన్య మదిని కూడా దోచేసి ఇద్దరు మనువాడే దాకా వీరి ప్రయాణం సాగింది. పెళ్లయ్యాక ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది.

సమంతకు సినిమాలతోపాటు ఓ వ్యాపకం కూడా ఉందట.. అదే విలాసవంతమైన కార్లు అంటే సమంతకు బాగా ఇష్టమట.. కోట్లలో పారితోషికం తీసుకునే ఈ ముద్దుగుమ్మ వద్ద ఇప్పటికే బోలెడు కార్లు ఉన్నాయన్నది చాలా మందికి తెలియదు.. సమంత వద్దనున్న లగ్జరీ కార్లు ఏవో చూద్దాం..

*సమంత 33వ పుట్టినరోజును ఏప్రిల్ 28న జరుపుకుంది. ఆమెకు కార్లు అంటే బాగా పిచ్చి కావడంతో ఇటీవలే బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును కొన్నది. దీని ధర ఏకంగా రూ.76లక్షలు కావడం గమనార్హం. ఈ కారు బుల్లెట్ ఫ్రూఫ్ కూడా. ఏ47తో దాడి చేసినా వాహనానికి ఏం కాదు. 100కి.మీల వేగాన్ని కేవలం 4.9 సెకన్లలోనే అందుకుంటుంది.

*ఇక సమంత ఇదివరకు కొన్న మరో కారు జాగ్వర్ ఎక్స్ ఎఫ్. దీని ధర ఏకంగా రూ.62లక్షలు. ఈ కారులోనే మొన్నటివరకు సమంత ప్రయాణించింది.

*ఇక సమంత కొన్న మరో భారీ కారు ఆడీక్యూ7. ఈ ఎస్యూవీ ధర ఏకంగా రూ.77.17లక్షలు. భారత్ లోనే అత్యంత ఎక్కువ విక్రయాలు సాగేది ఈ కారే. ఆధునిక ఫీచర్లు, సాంకేతిక దీని సొంతం.

*ఇక సమంతకు అత్యంత ఇష్టమైన స్పోర్ట్స్ కారు ‘పోర్షే కేమ్యాన్ జేటీఎస్’. ఎంతో ఇష్టపడి కొన్న ఈ కారు ధర రూ.1.15 కోట్లు కావడం విశేషం.