Begin typing your search above and press return to search.

రిలీజ్‌ అయిన ఏడు నెలలకు ఆల్‌ టైం రికార్డ్‌ దక్కించుకున్న భీమ్‌ ఫర్‌ రామరాజు

By:  Tupaki Desk   |   31 Oct 2020 8:50 AM
రిలీజ్‌ అయిన ఏడు నెలలకు ఆల్‌ టైం రికార్డ్‌ దక్కించుకున్న భీమ్‌ ఫర్‌ రామరాజు
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి రామ్‌ చరణ్‌ లుక్‌ ను ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ తో మార్చి 27వ తారీకున విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాని మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్‌ వ్యూస్‌ ను మాత్రం క్రాస్‌ చేయలేక పోయింది. లైక్స్‌ విషయంలో మహేష్‌ బాబు మూవీ కంటే చాలా ఎక్కువ ఉన్న భీమ్‌ ఫర్‌ రామరాజు వ్యూస్‌ విషయంలో ఇన్ని రోజులు వెనకబడి ఉంది. ఎట్టకేలకు అంటే విడుదలైన ఏడు నెలల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్‌ వ్యూస్‌ ను ఆర్‌ఆర్‌ఆర్‌ భీమ్‌ ఫర్‌ రామరాజు బీట్‌ చేసింది.

టాలీవుడ్‌ నుండి అత్యధిక వ్యూస్‌ ను దక్కించుకున్న టీజర్‌ గా ఇప్పటి వరకు సరిలేరు నీకెవ్వరు ఉండగా ఇప్పుడు నెం.1 స్థానంను భీమ్‌ ఫర్‌ రామరాజు దక్కించుకుంది. ఇటీవల రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో రావడంతో మళ్లీ రామ చరణ్‌ వీడియో కూడా ట్రెండ్‌ అయ్యింది. అందుకే గత వారం రోజులుగా భారీ వ్యూస్‌ మరియు లైక్స్‌ వచ్చాయి. దాంతో ఈజీగా సరిలేరు నీకెవ్వరు రికార్డును బ్రేక్‌ చేసింది.

సరిలేరు టీజర్‌ 33.26 మిలియన్‌ ల వ్యూస్‌ ను రాబట్టగా.. భీమ్‌ ఫర్‌ రామరాజు ప్రస్తుతం 33.32 మిలియన్‌ ల వ్యూస్‌ ను కలిగి ఉంది. ఇక ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ ఎన్టీఆర్‌ వీడియోకు 26 మిలియన్‌ ల వ్యూస్‌ ఉన్నాయి. మరి కొన్ని వారాల్లో ఎన్టీఆర్‌ వీడియో ఆల్‌ టైం రికార్డును దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తానికి అయితే టాప్‌ 2 స్థానాలు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకే దక్కబోతున్నాయి.