Begin typing your search above and press return to search.

చ‌వితి రోజు ఇలియానా ఏమిటీ చిలౌట్

By:  Tupaki Desk   |   22 Aug 2020 12:40 PM IST
చ‌వితి రోజు ఇలియానా ఏమిటీ చిలౌట్
X
ఊరంతా ఒక వైపు.. ఇలియానా మ‌రోవైపు.. అందుకేగా ఈ భామ వెరీ స్పెష‌ల్. అంద‌రిలా ఉంటే అందులో ప్ర‌త్యేక‌త ఇంకేం ఉంటుంది. అందుకేగా ఇదిగో ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు ఊరిస్తూ ఉడికిస్తూ వెర్రెత్తించ‌డం హ్యాబిట్ గా మార్చుకుంది. ఇంత‌కీ ఏం చేసిందేమిటి?

ఉన్న‌ట్టుండి ఇలా ఊరిమీద ప‌డింది మ‌రి. ఊరంతా వినాయ‌క చ‌వితి అంటూ పూజ‌లు పున‌స్కారాలు ఆచరిస్తుంటే ఈ బ్యూటీ మాత్రం త్రోబ్యాక్ ఫోటోల్ని షేర్ చేస్తూ అంత‌కంత‌కు వేడి పెంచేస్తోంది. బికినీలో స‌రాగాలు పాత ప‌ద్ధ‌తి. అందుకే ఇదిగో ఇలా జిమ్ వేర్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ టోన్డ్ బాడీని ఒంపుసొంపుల ఖిల్లాని అలా ప్ర‌ద‌ర్శిస్తూ టెంప్ట్ చేస్తోంది.

ఇంత టెంప్ట్ చేశాక మ‌నోళ్లు ఆఫ‌ర్ ఇవ్వ‌కుండా పోతారా? అందుకే గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోని త‌ర్వాత ఇక ప‌నైపోయింది అనుకుంటున్నా.. ఇంకా మ‌రో ఆప్ష‌న్ ఉంది అంటూ టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు ఈ అమ్మ‌డినే త‌ల‌చి త‌ల‌చి వేగి పోతున్నార‌ట‌. నాగార్జున‌.. బాల‌య్య‌.. వెంకీ లాంటి వాళ్ల‌కు ఇల్లీ బేబీ ఇక‌పై ఆప్ష‌న్ గా మారినా మారొచ్చు అంటూ ఒక‌టే ఫ్యాన్స్ తెగ‌ ఇదైపోతున్నారు. బాలీవుడ్ లో అజయ్ దేవ‌గ‌న్ వ‌రుస‌గా ఆఫ‌ర్లు ఇచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్ లోనే స‌రైన ప్రోత్సాహం సీనియ‌ర్ల నుంచి ద‌క్క‌డం లేదు. ఆండ్రూ నీబోన్ తో ల‌వ్ బ్రేక‌ప్ అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు ఎందుక‌నో. అభిషేక్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న న‌టించిన `ది బిగ్ బుల్` త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.