Begin typing your search above and press return to search.
సక్సెస్ లో గోవిందుడి షేర్ ఎంత?
By: Tupaki Desk | 18 Aug 2018 1:30 AM GMTఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిన గీత గోవిందం సక్సెస్ ని టీమ్ తో పాటు అభిమానులు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రేంజ్ హిట్ యూనిట్ ఊహించిందో లేదో కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు మాత్రం ఘనంగా నమోదవుతున్నాయి. వీక్ ఎండ్ ని దున్నేస్తున్నారు గీత గోవిందులు. ఇది ఏ రేంజ్ విజయమో అనే సంగతి కాసేపు పక్కన పెడితే అసలు ఇది ఇంతగా జనానికి రీచ్ కావడానికి లేదా ఇంతగా ఇది చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడేందుకు కారణం ఏంటా అనేది కాస్త లోతుగా విశ్లేషిస్తే గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం కాస్త ఆశ్చర్యపరిచేలా ఉంది. విడుదలకు ముందే మ్యూజిక్ లవర్స్ తో పాటు ఎప్పుడో ఒకసారి పాటలు వినే సగటు సినిమా ప్రేక్షకులకు సైతం పిచ్చ రేంజ్ లో కనెక్ట్ అయిన ఇంకేం కావాలే పాట చూడటం కోసమే సినిమాకు వస్తున్నట్టుగా థియేటర్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చెబుతుండటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక్కడ ఒక డౌట్ రావడం సహజం - ఇదంతా విజయ్ దేవరకొండ క్రేజా అని. ఒకవేళ నిజమే అనుకుంటే ఇంత పెద్ద సక్సెస్ లో అతని షేర్ ఎంత అనే అనుమానం రాకమానదు. కేవలం విజయ్ దేవరకొండనే చూడటం కోసం క్యూ కడుతున్నారు అనుకోవడం కూడా అతిశయోక్తి కావొచ్చు. అదే నిజమైతే ఎప్పుడో తీసి లేట్ గా విడుదల చేసిన ఏ మంత్రం వేసావేకు ఓపెనింగ్స్ వచ్చి ఉండాలి. కానీ జరిగింది వేరు. అలా అని విజయ్ ని తక్కువ చేయటం అని కాదు. ప్రీమియర్ షోలకు యూత్ పోటెత్తారు అంటే అది అతని ఇమేజ్ ప్రభావమే. ఇప్పుడు పాట వల్ల సినిమా ఇంత రేంజ్ కు వెళ్లిందా లేక విజయ్ ఛరిష్మాతో ఆడుతోందా అనే సందేహాలకు తెరవీడాలి అంటే ఇంకొంత సమయం పట్టేలా ఉంది. ఒక్క పాటతో సినిమా చూడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో అడవి రాముడులో ఆరేసుకోబోయి పాట ఆ మధ్య ఇంద్రలో దాయి దాయి దామ్మా పాటల కోసమే రిపీట్ ఆడియన్స్ వచ్చారు. మరి గీత గోవిందం సక్సెస్ వెనుక కారణం కూడా ఇంకేం కావాలేనా ఇంకేదైనా ఉందా వేచి చూస్తే సమాధానం దొరుకుతుంది.