Begin typing your search above and press return to search.

50 ప్లాస్టిక్ స‌ర్జ‌రీల న‌టికి క‌రోనా.. స‌ర్జ‌రీలే ముప్పు?

By:  Tupaki Desk   |   18 April 2020 4:00 AM GMT
50 ప్లాస్టిక్ స‌ర్జ‌రీల న‌టికి క‌రోనా.. స‌ర్జ‌రీలే ముప్పు?
X
కొవిడ్-19 సెల‌బ్రిటీల‌ను చుట్ట‌బెట్టోస్తోంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా క‌రోనా వైర‌స్ అంద‌రిపైనా దాడి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌ల‌వురు సెల‌బ్రిటీలు క్వారంటైన్లో ఉన్నారు. ప‌లువురు మృత్యువాత ప‌డ్డారు. నానాటికి వ‌ర‌ల్డ్ వైడ్ కేసుల సంఖ్య పెరుగుతోందే త‌ప్ప‌.. త‌గ్గిన జాడ క‌నిపించ‌లేదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టార్ స‌హర్ త‌బరా వైర‌స్ బారిన ప‌డింది. 22 ఏళ్ల ఇరానియ‌న్ స్టార్ ప్ర‌స్తుతం టెహ్రాన్ ఆసుప‌త్రిలో వెంటిలేట‌ర్ పై ఉంది. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

స‌హ‌ర్ త‌బ‌రాకి ప్ర‌త్యేకించి ఇన్ స్టాలో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి ఏంజెలినా జోలీ ఫ్యాన్స్ అంతా త‌బ‌రాకి ఫాలోవ‌ర్స్ కావ‌డంతో ఈ భామ సేఫ్ గా తిరిగి రావాల‌ని ప్రార్థించే వాళ్లు ఎక్కువ‌య్యార‌ట‌. త‌బ‌రా యాంజెలినాకి వీరాభిమాని. త‌న‌లా రూపం మార్చుకునేందుకు ఇప్ప‌టికే ఆమె ముఖం దేహానికి క‌లుపుకుని 50కి పైగా స‌ర్జ‌రీలు జ‌రిగాయి. దీంతో ఉన్న అందం కూడా కోల్పోయి వికృతంగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వికృతి రూప‌మే అమ్మ‌డికి బోలెడంత పాపులారిటీ తీసుకొచ్చింది. దైవ దూష‌ణ.. హింస‌ను ప్రేరేపించ‌డం.. యువ‌కుల‌ను అవినీతికి ప్రోత్స‌హించ‌డం వంటి మార్గాల ద్వారా గ‌తేడాది అక్టోబ‌ర్ లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్ప‌టి నుంచి జైలు జీవితం గ‌డుపుతోంది. ఈ నేప‌థ్యంలోనే త‌బారాకు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారణ అయింది.

వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌బరాను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ స‌భ్యులు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా న్యాయ‌మూర్తి నిరాక‌రించ‌డంతో ఖైదీగా ఉంటూనే క‌రోనాకి చికిత్స పొందుతుంది. అయితే క‌రోనా వైద్యం నేప‌థ్యంలో గ‌త స‌ర్జీరీలు ఏమైనా ఇబ్బందుల‌కు గురిచేస్తాయా? అన్న‌ది ఇక్క‌డ ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ర్జ‌రీలు బెడిసి కొట్ట‌డంతో త‌బారా బాగా వీక్ అయింది. కొవిడ్-19 పాత జ‌బ్బులున్న వారిపై..రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిపై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తోంది. చాలా కేసులు ఆ కార‌ణంగానే ఫెయిల‌వుతున్నాయి. అయితే వైర‌స్ నుంచి త‌మ ఫేవ‌రెట్ స్టార్ త‌బ‌రా తొంద‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోర‌కుంటున్నారు.