Begin typing your search above and press return to search.
'మా' ఎలక్షన్స్ నుండి ప్రకాష్ రాజ్ ఆల్మోస్ట్ ఔటేనా..?
By: Tupaki Desk | 7 July 2021 8:30 AM GMTటాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారాయి. వెయ్యి లోపే సభ్యులు ఉండే 'మా' ఎలక్షన్స్ గురించి రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ పదవీకాలం ముగియకుండానే.. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో క్లారిటీ లేకుండానే.. అధ్యక్ష బరిలో మేమున్నామంటే మేమున్నాం అంటూ పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవితా రాజశేఖర్ - హేమ - సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని చెప్పారు.
ప్రకాష్ రాజ్ ఒకడుగు ముందుకేసి 27మంది సభ్యులతో తన ప్యానల్ ని కూడా ప్రకటించారు. రెండేళ్ల నుంచి దీని కోసం గ్రౌండ్ వర్క్ చేశానని.. ‘మా’ కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని.. ‘మా’ సొంత భవనం నిర్మిస్తానని విలక్షణ నటుడు మీడియా ముఖంగా వాగ్దానాలు చేశారు. ఈ నేపథ్యంలో నాన్-లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ పరభాషా నటుడని.. 'మా' అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదని కొందరు సభ్యులు బహిరంగంగా ఆరోపించారు. మరోవైపు కళాకారులకు స్థానికతతో సంబంధం లేదని.. ప్రకాష్ రాజ్ ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఉన్నారని.. అధ్యక్ష పదవికి అర్హుడే అంటూ 'మా' లో కొందరు మద్దతుగా నిలిచారు.
ఇలా పోటాపోటీగా ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతూ.. ఎలక్షన్ డేట్ రాకముందే పోటీ రసవత్తరంగా మారేలా చేశారు. 'మా' సభ్యులు కొన్ని వర్గాలుగా చీలిపోయినట్లు అనిపించేలా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలు పెట్టడంతో 'మా' ఎన్నికలపై మీడియా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే 'మా' అధ్యక్షుడిని ఏకగ్రీవం చేస్తారనే న్యూస్ రావడంతో ఇప్పుడు సభ్యులు కాస్త సైలెంట్ గా ఉన్నారు. 'మా' మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ కూడా ఈసారి ఎన్నికలు ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని చెప్పడం చర్చనీయాంశం అయింది. చిరంజీవి - మోహన్ బాబు - జయసుధ వంటివారు చర్చలు జరిపి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మురళీమోహన్ తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పోటీ విషయమై లోకల్ - నాన్ లోకల్ వ్యవహారం నడుస్తూనే ఉంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి కంటే ముందుగా అధ్యక్ష బరిలో దిగుతున్నట్లు హడావుడి చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు సభ్యులు మెల్లిగా జరుకుంటున్నారట. దీనికి 'మా' అధ్యక్షుడిని ఏకగ్రీవం చేస్తారనే విషయం ఒక కారణమైతే.. ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ అనే వాదం సభ్యుల్లో కూడా మొదలవ్వడం మరో కారణమని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంతేకాదు పలువురు టాలీవుడ్ పెద్దలు కూడా ప్రకాష్ రాజ్ ని కాకుండా, ఈసారి ఓ మహిళకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇకపోతే తాజాగా ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ''ఎలక్షన్స్ ఎప్పుడు? #justasking'' అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఏకగ్రీవం అని మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే విలక్షణ నటుడు ట్వీట్ చేసి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.