Begin typing your search above and press return to search.

పెద్దోడు సిగ్గ‌రి కానీ చిన్నోడున్నాడే..! తార‌క్ వార‌సుల‌పై బిగ్ లీక్స్!!

By:  Tupaki Desk   |   21 May 2021 11:30 PM GMT
పెద్దోడు సిగ్గ‌రి కానీ చిన్నోడున్నాడే..! తార‌క్ వార‌సుల‌పై బిగ్ లీక్స్!!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎంతో జోవియ‌ల్ గా హుషారుగా అంద‌రితో క‌లివిడిగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆన్ లొకేష‌న్ ఉన్నా స్నేహితుల‌తో క‌లిసినా ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఆయ‌న వార‌సులు అలానే ఉంటారా? అంటే పెద్దోడు సిగ్గ‌రి కానీ చిన్నోడున్నాడే..! అంటూ తార‌క్ వార‌సుల‌పై బిగ్ లీక్స్!! అందాయి.

పెద్ద కుమారుడు అభ‌య్ రామ్ సిగ్గ‌రి. పైగా చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ చిన్నోడు భార్గ‌వ రామ్ చిచ్చ‌ర‌పిడుగు. లైవ్ వైర్ లాంటోడు. డాడీ NTR లా చాలా స్పీడ్ గా ఉంటాడు. ఇక పిల్ల‌లిద్ద‌రూ ఓచోట క‌లిస్తే ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఒక‌రినొక‌రు క‌లివిడిగా ఉంటారు. తార‌క్ వీలున్నంత వ‌ర‌కూ ఒక తండ్రిగా పిల్ల‌ల‌తో ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు.

తార‌క్ ఇత‌రుల‌తో పోలిస్తే ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి పెద్ద‌గా సోష‌ల్ మీడియా ప్రచారం కోరుకోరు. ముఖ్యంగా పిల్ల‌ల‌పై మీడియా ప్ర‌చారం అస్స‌లు నచ్చ‌దు. వారి బాల్యాన్ని కోల్పోకూడ‌ద‌నేది ఆయ‌న ఆలోచ‌న‌.
పిల్లలకు సంబంధించి ఎక్కువ‌ వీడియోలను తార‌క్ ఎందుకు విడుదల చేయలేదు? అంటూ ఇదే కార‌ణం. తన స్టార్ డమ్ వారి బాల్యాన్ని ప్రభావితం చేయడాన్ని అతను ఇష్టపడరుట‌.

తార‌క్ కి ఇటీవ‌లే కోవిడ్ సోకిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న తో పాటు మొత్తం కుటుంబం ఐసోలేష‌న్ లోనే ఉన్నారు. ఎవ‌రికీ ఎలాంటి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డలేదు. తార‌క్ ఈ వారంతంలో త‌న‌కు నెగెటివ్ అని ప్ర‌క‌టించే క్ష‌ణం కోసం అభిమానులంతా వేచి చూస్తున్నారు.