Begin typing your search above and press return to search.
చెలి చందమామను అల్లుకుపోయిన సఖుడు
By: Tupaki Desk | 5 Nov 2020 5:30 AM GMTచందమామను కాచే చందురూడు ఇడిగో ఇక్కడ కనిపిస్తున్నాడు చూశారుగా.. అతడు తన లైఫ్ లో సంథింగ్ స్పెషల్ అంటూ చందమామ ఎంతగా మురిసిపోతోందో!! కాజల్ అగర్వాల్ భర్త పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లు బుధవారం ఉదయం తన సతీమణితో రొమాంటిక్ గా ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఇది అరుదైన ఫోటో. నవదంపతుల కొత్త ఇంటి నుండి ఈ చిత్రాన్ని పంచుకున్నామని వెల్లడించారు. గౌతమ్ ఇచ్చిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్. అన్నట్టు ఈ ఫోటో ఇలా బయటకు రాగానే అలా ఫ్యాన్స్ ఒకటే ఇదైపోతున్నామంటూ మురిసిపోయారు. చెలి చందమామను అల్లుకుపోయిన సఖుడు అంటూ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చారు మరి.
కొత్త ఆరంభాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటోంది కొత్త జంట. గత వారం నా నమ్మశక్యం కాని భార్య మా కొత్త ఇంటిలో అడుగు పెట్టినందుకు మీ ఆశీర్వాదాలకు చాలా కృతజ్ఞతలు అంటూ గౌతమ్ వ్యాఖ్యను జోడించాడు. కాజల్ సోదరి నిషా అగర్వాల్ ``మీ ఇద్దరికీ ప్రేమ కానుక`` అంటూ రిప్లయ్ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు అక్టోబర్ 30 న ముంబైలో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే... గౌతమ్ కిచ్లు తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కాజల్ తో క్లాసిక్ చిత్రాన్ని షేర్ చేశారు.
కాజల్ `క్యూన్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హో గయా నా.. దో లాఫ్జోన్ కి కహాని .. స్పెషల్ 26 చిత్రాల్లో నటించింది. తెలుగు- తమిళంలో అగ్ర కథానాయిక హోదాను కొనసాగించింది. ముంబై సాగా- ఆచార్య- మోసగాళ్లు- హే సినామికా- పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ ఇండియన్ 2 లోనూ కాజల్ నాయికగా నటిస్తోంది.