Begin typing your search above and press return to search.

న‌వ వ‌ధువు కాజ‌ల్ పెళ్లి షూట్ లో హైలైట్ ఫోటో

By:  Tupaki Desk   |   6 Nov 2020 12:30 AM GMT
న‌వ వ‌ధువు కాజ‌ల్ పెళ్లి షూట్ లో హైలైట్ ఫోటో
X
చంద‌మామ కాజ‌ల్ ఓ ఇంటిది అయిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లుతో ఐదు నెల‌ల క్రితం సైలెంటుగా ఎలాంటి హంగామా లేకుండా నిశ్చితార్థం చేసుకుని... ఈ అక్టోబ‌ర్ 30న అంతే డీసెంట్ గా పెళ్లాడేసింది. ఈ వేడుక‌కు కొద్దిమంది బంధుమిత్రులు మాత్ర‌మే హాజ‌రు కాగా.. రిసెప్ష‌న్ కోసం మాత్ర‌మే సినీప‌రిశ్ర‌మ స్నేహితుల‌ను ఆహ్వానించ‌నుంది. అది కూడా కోవిడ్ భ‌ద్ర‌త వ‌ల్ల‌నే 2021 కి వాయిదా వేసుకుందిట‌.

అదంతా స‌రే కానీ.. ఇప్ప‌టికే భ‌ర్త గౌత‌మ్ కిచ్లుతో కాజ‌ల్ రొమాంటిక్ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. లేటెస్టుగా కాజ‌ల్ పెళ్లి ఫోటోషూట్ లో ఒక అరుదైన ఫోటో శ‌ర‌వేగంగా వైర‌ల్ అయిపోతోంది. ఈ ఫోటో చూడ‌గానే... చుక్క‌ల్లో చంద‌మామ నేరుగా భువికి దిగి వ‌చ్చిందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఆ ముత్యాలు పొదిగిన అతి భారీ లోలాకులు కాజ‌ల్ చెవికి వేలాడేవేనా? ఈ సాంప్ర‌దాయం ఎంతో బావుంది! అంటూ ఆస‌క్తిగా చూస్తున్నారంతా. న‌వ వ‌ధువు కాజ‌ల్ పెళ్లి షూట్ లో హైలైట్ ఫోటో

అటు హిందీ లోగిళ్ల సాంప్ర‌దాయం.. ఇటు తెలుగు త‌మిళ ట్రెడిష‌న్ లో వివాహం చేసుకున్న కాజ‌ల్ ప్ర‌తి ఈవెంట్ ని ఎంతో డిజైన‌బుల్ గా ప్లాన్ చేస్కోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇక పెళ్లి త‌ర్వాత కాజ‌ల్ తిరిగి కెరీర్ ప‌రంగా బిజీ అయిపోనున్న సంగ‌తి తెలిసిన‌దే.