Begin typing your search above and press return to search.

మ‌ధురై..మండి! ఏంటి కంగ‌న ఈ క‌న్య్పూజ‌న్?

By:  Tupaki Desk   |   30 Oct 2022 4:30 AM
మ‌ధురై..మండి! ఏంటి కంగ‌న ఈ క‌న్య్పూజ‌న్?
X
బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేన‌దు. విష‌యం ఏదైనా? మ‌క్కుసూటిగా మాట్లాడ‌టం అమ్మ‌డి నైజం. ఒణుకు..బెణుకు కంగ‌న బ్ల‌డ్ లోనే లేదు. వివాదం ఎలాంటిదైనా వివ‌ర‌ణ ఇచ్చే విధానం మాత్రం ప్ర‌త్య‌ర్ధికి గూబ గీయిమ‌నిపించేలా ఉంటుంది. ఈ విష‌యంలో కంగ‌న పీహెచ్ డీ ఎప్పుడో చేసేసింది.

ఇండ‌స్ర్టీలో ఎదిగే క్ర‌మంలో ఎలాంటి వివాదాల‌కు వెళ్ల‌కుండా కామ్ గా ఉన్న బ్యూటీ స్టార్ గా ఎదిగిన త‌ర్వాత త‌న‌లో రెండో యాంగిల్ని బ‌య‌ట‌కు దీసి దుమ్మ‌దులుపేస్తోంది. ఇప్ప‌టికే హీరోయిన్ ఎన్నో సినిమాలు చేసింది. లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేసేసింది. కొత్త‌గా అమ్మ‌డు బాలీవుడ్ లో చేసేదేం? లేదు! అనుకుందో ఏమో గానీ కొద్ది రోజులుగా రాజకీయాల‌పై ఆస‌క్తిని సంద‌ర్భం చిక్కిన‌ప్పుడ‌ల్లా వ్య‌క్తం చేస్తోంది.

ఆ మ‌ధ్య త‌మిళ‌నాడు దేవాల‌యాల మ‌ధురై ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌కీయాల గురించి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని.. మ‌ధురై నుంచే రంగంలోకి దిగుతాన‌ని వెల్ల‌డించింది. అప్ప‌టి నుంచి కంగ‌న బాలీవుడ్ లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ని కుదిపేసిన భామ రాజ‌కీయాల్ని ఓ రేంజ్ లో ఏల్తుందంటూ ప్ర‌శంసలందుకుంది.

తాజాగా మ‌రోసారి అదే ప్ర‌శ్న కంగ‌న ముందుకెళ్లింది. ప్ర‌జ‌లు కోరితే? తాను హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండి నియోజ‌క వ‌ర‌గ్ం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాన‌ని స్ప‌ష్టం చేసింది. తాను రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం కాదని.. ప్ర‌భుత్వం త‌న భాగ‌స్వామ్యం కోరుకుంటే క‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని కంగ‌న చెప్పుకొచ్చింది.

మొత్తానికి కంగ‌న మ‌న‌సులో రాజ‌కీయాల్లోకి రావాల‌ని బ‌లంగా ఉంద‌న్న విష‌యం అర్ధ‌మ‌వుతోంది. ఏ పార్టీలో చేరుతుంది? కంగ‌న ని ఆహ్వానించే పార్టీ ఏది? అన్న‌ది తెలియాలి. అయితే కంగ‌న కంటెస్ట్ పై మాత్రం క్లారిటీ లేదు. కాసేపు మధురై నుంచి అంటోంది. మ‌రి కాసేపు మండి అంటోంది? ఇంకా ఇత‌ర రాష్ర్టాల ప‌ర్యట‌న‌కు వెళ్తే అక్క‌డ నుంచి పోటీ చేస్తుందా? అంటూ సెటెర్లు ప‌డుతున్నాయి. ముందు పార్టీ ఫిక్స్ చేయ్..ఆ త‌ర్వాత పోటీ చేసే నియోజ‌క వ‌ర్గం పై క్లారిటీ! ఇవ్వు అమ్మ‌డు అంటూ నెటి జ‌నులు కోరుకుంటున్నారు.