Begin typing your search above and press return to search.

వీడియో: సెక్సీ బాక్స‌ర్.. క‌ళ్లు ఆర్ప‌లేరు!

By:  Tupaki Desk   |   19 Nov 2019 9:07 AM GMT
వీడియో: సెక్సీ బాక్స‌ర్.. క‌ళ్లు ఆర్ప‌లేరు!
X
మ‌ల్లీశ్వ‌రి గా తెలుగు లోగిళ్ల‌లో సంద‌డి చేసిన క‌త్రిన అటుపై చాలా కాలంగా బాలీవుడ్ కు మాత్ర‌మే అంకిత‌మైంది. ఇటు సౌత్ సినిమాల్లో న‌టించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేదు ఎందుక‌నో. ఇటీవ‌లే ఓల్డ్ ఫ్రెండ్ స‌ల్మాన్ ఖాన్ తో స్నేహం చిగురించాక వ‌రుస‌గా అత‌డి స‌ర‌స‌న న‌టిస్తోంది. టైగ‌ర్ జిందా హై లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించింది. అయితే ఆ త‌ర్వాత స‌ల్మాన్ తోనే చేసిన చిత్రం ఊహించ‌ని ఫ‌లితాన్ని ఇచ్చింది. ఎన్నో అంచ‌నాల న‌డుమ రిలీజైన `భార‌త్` చిత్రం క‌త్రిన‌కు చేదు అనుభ‌వం మిగిల్చింది.

అయినా క‌త్రిన‌కు కెరీర్ ప‌రంగా వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. ప్ర‌స్తుతం కిలాడీ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న సూర్య‌వంశీ చిత్రంలో న‌టిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న శైలిలోని ఓ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత కిలాడీ స‌ర‌స‌న న‌టిస్తోంది క‌త్రిన‌. ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని భారీ చిత్రాల్లోనూ న‌టించ‌నుంది ఈ అమ్మ‌డు. అలాగే క‌త్రిన `కె` పేరుతో త‌న సొంత బ్రాండ్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్ని మార్కెట్ లోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. వీటి ప్ర‌చారం కోసం ఇంత‌కుముందు సౌత్ స్టార్ న‌య‌న‌తార స‌హా ప‌లువురు స్టార్ల‌తో ప్ర‌క‌ట‌న‌లు రూపొందించింది. అవి తొంద‌ర్ల‌నే ఎయిర్ లోకి రానున్నాయి.

ఈలోగానే ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్స‌ర్ మే వెద‌ర్ తో క‌త్రిన టై అప్ పెట్టుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌త్రిన బాగా చెమ‌ట‌ల‌తో త‌డిసి(స్ప్రే కొట్టుకుందిలే) ఉన్న ఓ వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసింది. పింక్ అండ్ బ్లాక్ స్పోర్ట్స్ బ్రా.. ట్రాక్ ఫ్యాంట్ ధ‌రించి క‌నిపించింది. సీరియ‌స్ గా బాక్సింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించింది. అంతేకాదు.. ఫ్లాయిడ్ మే వెద‌ర్ తో భాగ‌స్వామిని అవుతున్నా! అంటూ క‌త్రిన ఓ హింట్ ఇచ్చింది. ఇది సంథింగ్ స్పెష‌ల్ అని అంటోంది. అయితే ఆ స్పెష‌ల్ ఏమిటో క‌నిపెట్ట‌మ‌ని అభిమానుల‌కు ఫ‌జిల్ వేయ‌డంతో దేనికోసం ఈ టైఅప్ అంటూ స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కీ ఏం చేయ‌బోతోంది చెప్మా? అయినా బాక్స‌ర్ తో సెక్సీ బాక్స‌ర్ టై అప్ దేనికోసం? ఏదైనా బాక్సింగ్ నేప‌థ్యంలో బ‌యోపిక్ లో న‌టించ‌బోతోందా? లేక `కె` బ్రాండ్ కార్పొరెట్ ప్ర‌క‌ట‌న రూప‌క‌ల్ప‌న కోస‌మా? అన్న‌ది త‌నే చెప్పాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి