Begin typing your search above and press return to search.
సర్కారు వారి పాటలో వెయిట్ ఉన్న పాత్రలో మహానటి
By: Tupaki Desk | 3 Nov 2020 3:50 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ ల కాంబోలో రూపొందబోతున్న 'సర్కారు వారి పాట' హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ మేకర్స్ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా ఆమెనే కన్ఫర్మ్ చేస్తూ చిత్ర యూనిట్ సభ్యులు మహేష్ బాబుతో సహా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర మరీ తక్కువగా ఉందని అలాగే ఆమెకు ఎక్కువగా ప్రాముఖ్యత దక్కలేదు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కథకు హీరోయిన్ పాత్రక అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది.
మహేష్ ఈ సినిమాలో మాత్రం అలా కాదు. కథలో హీరోయిన్ చాలా కీలక పాత్రను కలిగి ఉంటుంది. దర్శకుడు పరశురామ్ ఏ సినిమా చేసినా కూడా హీరోయిన్ కు ప్రాముఖ్యత ఉండేలా చూస్తాడు. ఆయన గత సినిమా గీత గోవిందంలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో కూడా కథకు చాలా కీలకం అయిన... స్క్రీన్ ప్లేలో మూల స్థంభంగా నిలిచే పాత్రను కీర్తి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడం వల్లే జాతీయ అవార్డు గ్రహీత అయిన కీర్తి సురేష్ ను మేకర్స్ ఎంపిక చేశారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. త్వరలో అమెరికాలో ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పక్రియ పూర్తి అయిన తర్వాత అక్కడకు యూనిట్ సభ్యులు వెళ్లబోతున్నారు.