Begin typing your search above and press return to search.

ఎర్ర‌కోక‌లో జివ్వ‌నిపించిన తేనెటీగ బాలిక‌

By:  Tupaki Desk   |   11 Aug 2021 11:30 PM GMT
ఎర్ర‌కోక‌లో జివ్వ‌నిపించిన తేనెటీగ బాలిక‌
X
కొత్తకోక కిర్రెక్కిపోనీ.. సన్న రైక వెర్రెక్కిపోనీ ..కన్నెసొగసే దుమ్మిత్తిపోనీ.. బావ‌వు నువ్వు భామ‌ను నేను!! అంటూ ఎర్ర‌కోక‌లో భానుప్రియ రాయుడుగారిని ఆట‌ప‌ట్టించిన తీరును మ‌ర్చిపోలేం. పెద‌రాయుడు చిత్రంలోనిది ఈ పాట‌. భాను ప్రియ అద్భుత నృత్య‌విన్యాసాలు యువ‌త‌రాన్ని స‌మ్మోహ‌నంలో ముంచెత్తాయి.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో భాను ప్రియ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి అభిన‌య నేత్రి క‌నిపించ‌లేద‌ని విమ‌ర్శ అలానే ఉంది. అయితే ఆ లోటును పూడ్చేందుకు మ‌ల్లూ భామ‌లు ప్ర‌య‌త్నించి కొంత‌వ‌ర‌కూ స‌క్సెసయ్యారు. కొంద‌రు ముంబై భామ‌లు కూడా బుట్ట‌బొమ్మ‌లుగా బాపు బొమ్మ‌లుగా ఇటీవ‌ల వెలిగిపోతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ముంబై బ్యూటీ పూజా హెగ్డేకి బుట్ట‌బొమ్మ‌గా గుర్తింపు తెచ్చిన‌ది త్రివిక్ర‌మ్.

ఇక‌పోతే మ‌రో ముంబై బొమ్మ కియ‌రా అద్వాణీకి తెలుగులో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ త్రివిక్ర‌మ్ తో ఛాన్స్ ద‌క్క‌లేదు కానీ.. ఈపాటికే ఈ భామ‌ను కూడా బాపు బొమ్మ‌గా ఎంకిలాగా మ‌లిచేవాడే. మునుముందు త్రివిక్ర‌మ్ కొర‌టాల వంటి వారితో ఈ భామ సినిమా చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ప్ర‌స్తుతానికి చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ లో పాన్ ఇండియా మూవీ ఆర్.సి 15కి కియ‌రా సంత‌కం చేసింది. అటు బాలీవుడ్ సినిమాల‌ను మ్యానేజ్ చేస్తూనే శంక‌ర్ తో ఆఫ‌ర్ ని వ‌దులుకోలేదు ఈ బ్యూటీ.

తాజాగా కియ‌రా రెడ్ హాట్ శారీ లుక్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. చీర‌లో కియ‌రా ఎంత ట్రెడిష‌న‌ల్ గా ఉంటుందో విన‌య‌విధేయరామ చిత్రంలో క‌నిపించింది. ఇప్పుడు మ‌రోసారి ఎర్ర కోక‌లో సుర్ర‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. కియ‌రా రెడ్ హాట్ లుక్ అద్భుతం అంటూ అబిమానులు కితాబిచ్చేస్తున్నారు.