Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టిన కృష్ణంరాజు

By:  Tupaki Desk   |   20 Jan 2021 4:15 PM GMT
రాధేశ్యామ్ ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టిన కృష్ణంరాజు
X
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్‌' సినిమా అప్‌ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న పభాస్ అన్ని భాషల అభిమానులు కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఈ సమయంలో సినిమా గురించి కృష్ణం రాజు ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెళ్లడించాడు. సినిమాను ఏప్రిల్‌ లో విడుదల చేయాలనుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు ఆయన కూతురు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాలో కీలక పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని వాటిపై ఇప్పటికి క్లారిటీ రాలేదు. కాని మొదటి సారి కృష్ణం రాజు వాటిపై క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాలో కీలక పాత్రను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ పాత్ర కోసం తాను గడ్డం కూడా పెంచానంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్‌ త్వరలో పూర్తి చేస్తాం. ప్రభాస్‌ మరియు నాకు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. పాటలు కూడా పూర్తి అయ్యాయి. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతుందని కృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు పరమహంస అనే ఒక మహా జ్ఞాని పాత్రలో కనిపించబోతున్నాడట. నేడు కృష్ణంరాజు బర్త్‌ డే సందర్బంగా సినిమా గురించి వచ్చిన ఈ అప్‌ డేట్ తో రెబల్‌ స్టార్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.