Begin typing your search above and press return to search.
ఒక్కటైనా రిలీజ్ కాలేదు.. అప్పుడే అంత క్రేజా..?
By: Tupaki Desk | 2 Feb 2021 10:30 AM GMTఒకటో సినిమా అయినా రిలీజ్ కాలేదు. అప్పుడే నాలుగు సినిమాలకు సంతకాలు చేసింది ఈ కుర్రబ్యూటీ. ఇటీవలి కాలంలో ఇంత క్రేజుతో దూసుకొచ్చిన మరొక భామ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఎవరీ భామ? అంటే.. ఉప్పెన ఫేం కృతి శెట్టి.
చారెడేసి కళ్లు చిక్లెట్ బుగ్గలతో తెగ ఊరిస్తున్న ఈ అమ్మడికి యూత్ లో ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా స్కూల్ కాలేజ్ బోయ్స్ అయితే పడి చస్తున్నారు. ఎట్టకేలకు తొలి పరిచయ చిత్రం ‘ఉప్పెన’ ఫిబ్రవరి 12న థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలన్న తపన పరిశ్రమ వర్గాలకు ఉంది. ఇది బ్లాక్ బస్టర్ అయితే ఆ క్రెడిట్ లో సగం కృతికే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. తన అందం చందం అభినయం నవ్వే తీరు ప్రతిదీ కుర్రాళ్ల గుండెల్లోకి అంతగా కనెక్టయిపోయింది.
ఇది మెగా డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ కి పెద్ద ప్లస్ కానుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఆరంభ హీరోగా అతడు కూడా ఎంతో నేచురల్ పెర్ఫామెన్స్ తో కనిపిస్తున్నాడని టీజర్లు పోస్టర్లు చెప్పకనే చెప్పాయి.
ఉప్పెన రిలీజ్ కి ముందే కృతి నాలుగు సినిమాలకు సంతకాలు చేసిందన్నది ఓ గుసగుస. నాని సరసన ‘శ్యామ్ సింఘం రాయ్’ .. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటితో కలిసి తదుపరి రెండు ప్రాజెక్టులకు సంతకాలు చేసిందట. సుధీర్ బాబు-ఇంద్రగంటి మూవీలోనూ కృతి నాయిక. ఆ ప్రాజెక్టులతో పాటు ఇతర నిర్మాతలు తన సంతకం కోసం వెయిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కృతిలోని మెస్మరైజింగ్ క్వాలిటీకి జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తుండడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
యువహీరోల సరసన ప్రేమ కథలకు కృతి తప్పనిసరి ఆప్షన్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు బంతి కృతి కోర్టులోనే ఉంది. ఏది ఎంపిక చేయాలి? ఏది వదిలేయాలి? అన్నది తనే నిర్ణయించాలి. ఒక ఆరంభ నాయికకు ఇంత ఘనమైన ఆరంగేట్రం ఇంకేదీ ఉండదేమో!