Begin typing your search above and press return to search.
తనలోని మరో యాంగిల్ చూపిస్తానంటున్న భూమిక
By: Tupaki Desk | 19 March 2020 10:50 AM GMTతెలుగులో సుమంత్ నటించిన 'యువకుడు' సినిమా ద్వారా పరిచయమైన భూమికా చావ్లా 'ఖుషి' సినిమాతో యువతరం హృదయాల్ని దోచుకుంది. 'ఖుషి' సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే. భూమిక ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కుర్రాళ్లకు తారకమంత్రం. ఖుషీ లాంటి సంచలన సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత ఒక్కడు, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో నటించిన భూమిక సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించింది. కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు కొన్నాళ్ల పాటు దూరం అయింది. ఆ తరవాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టి నిర్మాతగానూ మారింది. ఆ సమయంలో బాలీవుడ్ వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. 'ఎమ్మెస్ ధోనీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక, ఈ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తెలుగులో నాగచైతన్య 'సవ్యసాచి' మరియు నాని హీరోగా నటించిన 'ఎంసీఏ' మూవీలలో కీలక పాత్రలు పోషించింది. బాలకృష్ణ 'రూలర్'లోనూ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడామె చేతిలో రెండు మూడు సినిమాలు దాకా ఉన్నాయి. ఐతే భూమిక చావ్లాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే భూమిక త్వరలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమని, ‘మిస్సమ్మ’లో నా పాత్ర అలానే కొనసాగినా చివర్లో కథంతా మారిపోతుందని, ఈసారి అలా కాకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నెగటివ్ షేడ్స్ లో కొనసాగుందని, ఓ రకంగా చెప్పాలంటే లేడీ విలన్ పాత్ర అని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా పేరేమిటో రెవీల్ చేయలేదు. ఇది ఒక స్టార్ హీరో సినిమానే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ హీరో ఎవరో, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏదేమైనా భూమిక కోరిక మాత్రం ఈసినిమాతో తీరబోతోందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.