Begin typing your search above and press return to search.

మ‌రో క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ తెలుగులో రీమేక్

By:  Tupaki Desk   |   14 July 2020 4:30 AM GMT
మ‌రో క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ తెలుగులో రీమేక్
X
టాలీవుడ్ లో వ‌రుస‌గా ఇరుగు పొరుగు భాష‌ల చిత్రాలు రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ప‌లు మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ల రీమేక్ ల‌కు మెగా ఫ్యామిలీ హీరోలు స‌న్నాహ‌కాల్లో ఉండ‌డం హాట్ టాపిక్ గా మారింది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ ఇప్ప‌టికే ప‌లు మ‌ల‌యాళ రీమేక్ ల‌ను లాక్ చేసి కాస్టింగ్ సెలెక్ష‌న్స్ తో బిజీగా ఉంది.

తాజాగా కన్నడ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `లవ్ మాక్ టైల్` రీమేక్ కి తెలుగు నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారని స‌మాచారం. ఈ మూవీని ఓ కొత్త బ్యాన‌ర్ నిర్మించ‌నుంద‌ని... సెప్టెంబ‌ర్ మిడ్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్నార‌ని తెలిసింది. `జ్యోతిల‌క్ష్మి` ఫేం సత్య దేవ్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా క‌థానాయిక అని తెలుస్తోంది. తెలుగు వెర్ష‌న్ ద‌ర్శకుడు ఎవ‌రు అన్న‌ది తెలియాల్సి ఉంది. దాంతో పాటే టెక్నీషియ‌న్ల‌ వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఇక ఇటీవ‌ల స‌త్య‌దేవ్ నటించిన కాప్ డ్రామా `47 డేస్` ఓటీటీలో రిలీజైన సంగ‌తి విధిత‌మే.

`లవ్ మాక్ ‌టైల్` 2020 జ‌న‌వ‌రిలో రిలీజైన కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం. కృష్ణ దర్శకత్వం వహించ‌గా.. కృష్ణ- మిలానా నాగరాజ్ నిర్మించారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లే ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ప్రేమ‌కోసం త‌పించే యువ‌త‌రం క‌థాంశ‌మిది. తెలుగు యూత్ కి న‌చ్చేస్తుంద‌నే క్యాలిక్యులేష‌న్ తోనే తాజా రీమేక్ కి ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌లయాళ చిత్రం బెంగ‌ళూర్ డేస్ తర‌హాలో మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీ ఇద‌ని చెబుతున్నారు.