Begin typing your search above and press return to search.

రవితేజ ఆ బ్యూటీతో ఐదోసారి కలుస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:30 AM GMT
రవితేజ ఆ బ్యూటీతో ఐదోసారి కలుస్తున్నాడా..?
X
మాస్ మహారాజా ర‌వితేజ ఫుల్ స్పీడ్ తో వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని తో హ్యాట్రిక్ మూవీ 'క్రాక్' షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసాడు. ఇదే క్రమంలో 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే మూవీని స్టార్ట్ చేశాడు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ను హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌ బ్యానర్ పై కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. దీని తర్వాత మారుతి డైరెక్ష‌న్ లో సినిమా చేసే అవ‌కాశం ఉందని టాక్ నడుస్తోంది.

గతేడాది చివర్లో 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ సినిమా తర్వాత మారుతి మరో సినిమా చేయలేదు. అయితే ర‌వితేజ‌తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని.. ఇందులో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మించనున్నారని టాక్. ఇక ఈ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానాను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని టాక్ న‌డుస్తోంది. ఇలియానా ఇంతకుముందు రవితేజతో కలసి 'ఖాతార్నాక్' 'కిక్' 'దేవుడు చేసిన మనుషులు' 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విష‌య‌మై మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి.