Begin typing your search above and press return to search.
'మా' ఎలక్షన్స్: ప్రకాష్ రాజ్ Vs నరేష్ ట్వీట్ వార్..!
By: Tupaki Desk | 8 July 2021 6:03 AM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరుపుతామని 'మా' జనరల్ బాడీ ప్రకటించగా.. మూడు నెలల ముందుగానే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్నామంటూ ఇప్పటికే ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవితా రాజశేఖర్ - హేమ - సీవీఎల్ నరసింహారావు పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చేశారు. ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల తరహాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితి క్రియేట్ అయింది.
అయితే ప్రకాశ్ రాజ్ అందరికంటే ముందే 'మా' అధ్యక్ష పదవి కోసం వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న 'మా' అధ్యక్షుడి పదవీకాలం ముగియకుండానే.. ప్రస్తుత కమిటీలోని సభ్యులను తీసుకొని 27 మందితో తన ప్యానల్ ని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇండస్ట్రీలోని పెద్దలతో మాట్లాడుతూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు వంటి వారు బహిరంగంగా తమ రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా నా సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు కూడా విలక్షణ నటుడికే ఉంటుందని అన్నారు.
అదే సమయంలో ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి రావడంతో ఇండస్ట్రీ మొత్తం కొన్ని వర్గాలుగా విడిపోయిందనే అభిప్రాయం కలిగేలా చేసింది. ఈ నేపథ్యంలో 'మా' మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు మురళీ మోహన్ 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఎన్నికలే ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికలు ఈసారి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఎవరికి పడితే వాళ్లకు 'మా' సభ్యత్వం దొరుకుతుందని.. దీంతో ఎవరు 'మా' సభ్యుడో కాదో కూడా తెలియడం లేదని విమర్శించారు. గాడి తప్పిన 'మా' ను మళ్లీ పట్టాలెక్కించడానికి చిరంజీవి - మోహన్ బాబు - జయసుధ - కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నామని.. అందరిని ఒకతాటి పైకి తెచ్చి 'మా' ఎన్నికలు ఏకగగ్రీవంగా జరిగేలా చూస్తామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
దీంతో మురళీ మోహన్ కామెంట్స్ కు కౌంటర్ అన్నట్లుగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ''ఎలక్షన్స్ ఎప్పుడు? #justasking'' అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ విజయ కృష్ణ.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ చేశారు. 'మా' జనరల్ బాడీ తీర్మానం తర్వాత కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 'మా' ఎన్నికలు సెప్టెంబర్ లో నిర్వహిస్తామని ఇది వరకే స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇదెలా ఉందంటే నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్ లో దూకుతాను అన్నట్టుగా ఉందంటూ నరేష్ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. దీనికి ప్రకాశ్ రాజ్ కు 'మా' జనరల్ సెక్రటరీ ఇచ్చిన లిఖిత పూర్వక సంధాన పత్రాన్ని కూడా నరేష్ జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఏదేమైనా 'మా' ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్న తీరుపై కొందరు విమర్శలు చేస్తుంటే మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని.. 'మా' అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదని ఆరోపణలు కూడా వచ్చాయి. కళాకారులకు స్థానికతతో సంబంధం లేదని.. ప్రకాష్ రాజ్ ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఉన్నారని..జాతీయ ఉత్తమ నటుడని మరొకొందరు కామెంట్స్ చేశారు. మరి చివరకు వెయ్యి లోపు సభ్యులు ఉండే 'మా' కు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో చూడాలి.