Begin typing your search above and press return to search.

మహేష్ పేల్చిన సమంత జోక్..

By:  Tupaki Desk   |   10 Sep 2017 9:36 AM GMT
మహేష్ పేల్చిన సమంత జోక్..
X
మహేష్ బాబు-సమంత మధ్య కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆన్ స్క్రీనే కాక.. ఆఫ్ స్క్రీన్లో కూడా వీళ్లిద్దరి కెమిస్ట్రీ ప్రత్యేకమైంది. ‘1 నేనొక్కడినే’ సినిమా పోస్టర్ మీద సమంత పంచ్.. ఆ తర్వాత మహేష్ కౌంటర్.. ఇద్దరూ కలిసి ‘మేము సైతం’ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పరస్పరం పంచులతో రెచ్చిపోవడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సమంతకు ఏమాత్రం సంబంధం లేని ఓ వేడుకలో సమంత మీద జోక్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మహేష్. ఈ చిత్రం చెన్నైలో ‘స్పైడర్’ ఆడియో వేడుక సందర్భంగా చోటు చేసుకుంది.

ఈ వేడుకలో స్పష్టంగా తమిళంలో మాట్లాడుతూ తమిళ జనాల్ని ఆశ్చర్యపరిచాడు మహేష్. ఐతే ఈ వేడుకకు యాంకరింగ్ చేసిన ప్రముఖ గాయని.. డబ్బింగ్ ఆర్టిస్ట్ మహేష్ ప్రసంగం ముగిసిన వెంటనే అతడికి కొన్ని ప్రశ్నలు వేయడానికి సిద్ధమైంది. ఐతే ఆమె రెండు మాటలు మాట్లాడగానే మహేష్ బ్రేక్ వేశాడు. మీరు మాట్లాడుతుంటే సడెన్ గా సమంత వచ్చిందేంటి అని షాకయ్యాను అన్నాడు మహేష్. చిన్మయి సమంతకు కెరీర్ ఆరంభం నుంచి డబ్బింగ్ చెబుతోందన్న సంగతి తెలిసిందే. చిన్మయిని సమంత ఆత్మ అని కూడా అంటుంటారు. ఈ నేపథ్యంలోనే మహేష్ సరైన టైమింగ్ లో జోక్ పేల్చి అందరినీ నవ్వించాడు. మహేష్ బయటి వేడుకల్లో ముభావంగా కనిపించినప్పటికీ.. షూటింగుల సందర్భంగా భలే జోకులు పేలుస్తుంటాడని.. అతడి సెన్సాఫ్ హ్యూమర్ సూపరని చాలామంది అంటుంటారు. ఆ యాంగిల్ ‘స్పైడర్’ ఆడియో వేడుకలో చూపించాడు మహేష్.