Begin typing your search above and press return to search.
మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?
By: Tupaki Desk | 19 Oct 2019 1:19 PM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరో అంటే ఠక్కున వినిపించే పేర్లలో మొదట ఉండే పేరు మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్న సమయంలో నెం.1 స్థానం కోసం మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా పోటీ ఉండేది. కాని ఇప్పుడు మహేష్ బాబుకు పెద్దగా పోటీ లేదు. యంగ్ స్టార్ హీరోల్లో టాప్ హీరో.. సీనియర్ హీరోల కంటే కూడా అధికంగా ఫాలోయింగ్ స్టార్ డం కలిగి ఉన్నాడు. అలాంటి మహేష్ బాబు తనకు బన్నీ ఎక్కడ పోటీ వస్తాడో అంటూ భయపడుతున్నట్లుగా అనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి.
సంక్రాంతికి 'అల వైకుంఠపురంలో' చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. బన్నీ సినిమా విడుదలవుతున్న రోజే సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్మాతలను మహేష్ బాబు ఒత్తిడి చేస్తున్నాడట. సోలోగా బన్నీ సినిమా వస్తే తన సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందేమో అనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు ఇలా పోటీకి వస్తున్నాడంటూ కొందరు మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బన్నీతో ఢీ కొట్టేందుకు మహేష్ ఆసక్తి చూపడంతో ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నాడు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. నెం.1 కోసం ట్రై చేస్తున్న అల్లు అర్జున్ తో పోటీ పడటం అంటే బన్నీ తన రేంజ్ కు వస్తాడని మహేష్ భయపడుతున్నాడని అంటున్నారు. బన్నీ సినిమా వచ్చే రోజునే మహేష్ సినిమా విడుదల చేయాలని పట్టుబట్టడానికి కారణం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
అల వైకుంఠపురంలో సినిమాకు ఒకటి రెండు రోజుల ముందే సరిలేరు నీకెవ్వరు వస్తే వచ్చే సమస్య ఏంటీ.. జరిగే నష్టం ఏంటీ అంటూ మహేష్ బాబును నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు రెండు కూడా ఒకే రోజు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ విషయమై తీవ్ర చర్చ జరుగుతోంది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రావడం కామన్ కాని ఒకే రోజు రెండు సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
రెండు సినిమాలకు కనీసం రెండు మూడు రోజుల గ్యాప్ పెట్టుకుని విడుదల చేసుకోవచ్చు. కాని మహేష్ మాత్రం అదే తేదీని ఎందుకు కావాలనుకుంటున్నాడో అంటూ అర్థం కావడం లేదని సినీ వర్గాల వారు కూడా గుసగుసలాడుతున్నారు. రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా తేదీని మార్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాని మహేష్ మాత్రం నిర్మాతలకు ముందే అస్సలు తగ్గవద్దని సూచించాడంటూ సమాచారం అందుతోంది. ఇద్దరు కూడా తగ్గక పోవడంతో రెండు సినిమాలకు కూడా నష్టం తప్పదని నిర్మాతలు మరియు బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు.