Begin typing your search above and press return to search.

మహేష్ - బన్నీ మళ్ళీ బరిలో దిగబోతున్నారా...?

By:  Tupaki Desk   |   3 Jun 2020 1:30 PM GMT
మహేష్ - బన్నీ మళ్ళీ బరిలో దిగబోతున్నారా...?
X
2020 ఏడాది ప్రారంభంలో సంక్రాంతి వార్ లో సూపర్ స్టార్ మహేష్ - అల్లు అర్జున్ పోటీ పడిన విషయం తెలిసిందే. మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’.. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలు నువ్వా నేనా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడటంతో పాటు ప్రమోషన్స్ లో కూడా ఒకరి తర్వాత ఒకరంటూ పోటీ పడ్డారు. సినిమా విడుదలయ్యాక కలెక్షన్స్ విషయంలో కూడా వీరి సినిమాల మధ్య వార్ నడిచింది. ఒకరు 'బాక్సాఫీస్ మొగుడు' అంటే.. మరొకటి 'రంకు మొగుడు' అంటూ వచ్చాయి. మాది ఇండస్ట్రీ హిట్ అంటే, కాదు మాది ఇండస్ట్రీ హిట్ అంటూ పోటా పోటీగా చెప్పుకున్నారు. మావి రియల్ కలెక్షన్స్ అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తే మావి జెన్యూన్ అండ్ ఆర్గానిక్ కలెక్షన్స్ అంటూ మరొకరు పోస్టర్ విడుదల చేసారు. ఈ విధంగా సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు ఎవరికి వారు ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధించి సంక్రాతి విన్నర్లుగా నిలిచాయి. కొన్ని ఏరియాస్ లో ఒక సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చుకోగా మరికొన్ని ఏరియాల్లో ఇంకో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగా మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ - అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'పుష్ప' కరోనా ప్రభావం వలన వాయిదా పడింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ తన కెరీర్లో 27వ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ తో ప్రకటించేశాడు. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ రెండు చిత్రాలు మరికొన్ని రోజులలో షూటింగ్ కి వెళ్లనున్నాయి. బన్నీ ఇప్పటికే 2021 సమ్మర్ టార్గెట్ గా పెట్టుకోగా.. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సైతం అప్పుడే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వీరిద్దరి మధ్య ఆసక్తికర సమ్మర్ వార్ నడిచే అవకాశాలు లేకపోలేదు. ఇద్దరు పెద్ద హీరోలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమాలు కావడంతో వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలకి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా పోటీ ఉండబోతోంది. 'అల వైకుంఠపురంలో' సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఇప్పుడు 'సర్కారు వారి పాట'కి సంగీతం అందిస్తున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు 'పుష్ప'కి ఇస్తున్నాడు. ఇదే కనుక నిజమై రెండు సినిమాలు ఒకే టైం లో వస్తే మాత్రం మరోసారి బాక్సాఫీస్ దగ్గర నేనంటే నేను అంటూ పోటీ పడతారని చెప్పవచ్చు.