Begin typing your search above and press return to search.

2022 సంక్రాంతి పందెంలో ప‌వ‌న్ వ‌ర్సెస్ మ‌హేష్

By:  Tupaki Desk   |   4 Feb 2021 3:45 AM GMT
2022 సంక్రాంతి పందెంలో ప‌వ‌న్ వ‌ర్సెస్ మ‌హేష్
X
ప్ర‌తియేటా సంక్రాంతి పందెంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 2020 సంక్రాంతికి మ‌హేష్‌- బ‌న్ని ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ్డారు. సరిలేరు నీకెవ్వ‌రు వ‌ర్సెస్ అల వైకుంఠపురములో వార్ గురించి తెలిసిన‌దే. మెగా ఘ‌ట్ట‌మ‌నేని హీరోల బాక్సాఫీస్ పోటీ గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఎవ‌రు విజేత అనేదానికంటే ఎంత ఉత్కంఠగా పోటీ సాగింది? అన్న‌దే ఆస‌క్తిని క‌లిగించింది.

2021 సంక్రాంతి బ‌రిలో అంత ఉత్కంఠ‌ క‌నిపించ‌లేదు. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన క్రాక్ రిలీజ్ కాగా.. కొంత గ్యాప్ తో రామ్ రెడ్.. విజ‌య్ మాస్ట‌ర్ రిలీజ‌య్యాయి. కానీ 2022 సంక్రాంతి బ‌రిలో అస‌లు సిస‌లు వార్ ఫిక్స‌య్యింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ .. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న సినిమాలు వ‌చ్చే ఏడాది సంక్రాంతి పందెంలో దిగుతున్నాయ‌ని స‌మాచారం.

ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హిస్టారిక‌ల్ వారియ‌ర్ మూవీ 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాకి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్ తో పాటు హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే స‌గం షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి గ్రాఫిక్ వ‌ర్క్ తో పాటు నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్.

ఇక ఇటీవ‌లే మహేష్ - ప‌ర‌శురామ్ బృందం స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌ను దుబాయ్ లో ప్రారంభించారు. ఈ సినిమాని వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. ప‌వ‌న్ - మ‌హేష్ సినిమాలు ఇంత‌కుముందు సంక్రాంతి బ‌రిలో పోటీపడ్డాయి. ఇపుడు మ‌రోసారి అలాంటి వార్ కి తెర లేవ‌నుండ‌డం అభిమానుల్లో ఉత్కంఠ పెంచే విష‌య‌మే.