Begin typing your search above and press return to search.

గౌతమ్ తో హైట్ చెక్ చేసుకుంటున్న మహేష్..!

By:  Tupaki Desk   |   23 May 2020 5:30 AM GMT
గౌతమ్ తో హైట్ చెక్ చేసుకుంటున్న మహేష్..!
X
మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గానే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్'గా కూడా పిలవబడుతుంటాడు. సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో స్పెండ్ చేస్తుంటాడు. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు మహేష్. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను.. ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఇంకా కావాల్సినంత సమయం దొరకడంతో పండగ చేసుకుంటున్నాడు మహేష్. గౌతమ్ సితారాలతో కలిసి ఆడుకుంటూ చిన్న పిల్లాడిగా మారిపోతున్నాడు. అలానే వర్కౌట్స్ చేసుకుంటూ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. ఒకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు ఫ్యామిలీ టైమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా తెలియాజేస్తూనే ఉన్నాడు. డైలీ ఇదొక పోస్ట్ పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తూ వస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత కూడా వారి అల్లరి చేసే వీడియోలను పోస్టు చేస్తూ ఉంటుంది. తన పిల్లలతో మహేష్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ - గౌతమ్ ఇద్దరూ తండ్రీ కొడుకులు గా కాకుండా అన్నదమ్ముల్లా స్నేహితులు లాగా ఎంజాయ్ చేస్తుంటారు. '1 నేనొక్కడినే' సినిమాలో బుల్లి సూపర్ స్టార్ గా కనిపించిన గౌతమ్ ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. అందంలో లుక్స్ లో హైట్ లో తండ్రి మహేష్ కు జెరాక్స్ కాపీలా తయారవుతున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా చెక్ చేసుకుంటున్నాడు. కొడుకు కళ్ళముందే తనంత ఎత్తు పెరుగుతున్నందుకు మురిసిపోతున్నాడు.

ఇప్పుడు తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమాలలో గౌతమ్ తో కలిసి హైట్ చెక్ చేసుకునే వీడియో ఒకటి షేర్ చేసాడు. ''హైట్ చెక్. హి ఈజ్ టాల్'' అని క్యాప్షన్ పెట్టి రెండు హార్ట్ సింబల్ ఎమోజీస్ పెట్టాడు. గౌతమ్ మహేష్ కంటే కొంచం హైట్ తక్కువున్నప్పటికీ త్వరలోనే మహేష్ ఎత్తుకు వచ్చేస్తాడని అర్థం అవుతోంది. ఎందుకంటే మహేష్ - నమ్రత ఇద్దరూ చాలా హైట్ గా ఉంటారు. వారి జీన్స్ తో వచ్చిన గౌతమ్ కూడా వారంత ఎత్తు పెరుగుతాడని అతడిని చూస్తేనే చెప్పేయొచ్చు. అయితే ఈ వీడియోలో మహేష్ - గౌతమ్ ఇద్దరూ చిన్న పిల్లలుగా.. టీనేజ్ లోకి వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా వారు అన్నదమ్ములు అని అనుకుంటారు. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ కి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక గౌతమ్ ఇప్పటికే '1 నేనొక్కడినే' సినిమాలో బాల నటుడిగా అలరించాడు. సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో యంగ్ సూపర్ స్టార్ గా అవతరిస్తాడేమో చూడాలి.