Begin typing your search above and press return to search.

బన్నీకి 'మెగాస్టార్' ట్యాగ్ లైన్ కావాలా..?

By:  Tupaki Desk   |   10 April 2020 3:30 AM GMT
బన్నీకి మెగాస్టార్ ట్యాగ్ లైన్ కావాలా..?
X
సినీ ఇండస్ట్రీలో అభిమానుల మధ్య గొడవలు కామన్ గా ఉండేవే. ఇక మన టాలీవుడ్ లో అయితే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ - నందమూరి ఫ్యాన్స్ - అక్కినేని ఫ్యాన్స్ - ప్రభాస్ ఫ్యాన్స్ - మహేష్ ఫ్యాన్స్.. ఇలా అందరి మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఒకే ఫ్యామిలీకి చెందిన మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక్కక్కసారి వీరి అభిమానం హద్దులు మీరిన సందర్భాలు కూడా కోకొల్లలు. మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మెగా అభిమానుల్లో అంత‌ర్గ‌తంగా కొన్ని వ‌ర్గాలు ఏర్ప‌డ‌టం - విధ్వేషాలు న‌డుస్తుండ‌టం ఎన్నో సందర్భాల్లో బయటపడింది కూడా. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులకు ఇతర మెగా హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ గొడవే.

మెగాస్టార్ చిరంజీవి వల్ల ఈ పొజిషన్ లో ఉన్న బన్నీకి ఇప్పుడు పొగరు పెరిగి మెగాస్టార్ - పవర్ స్టార్ అంటే రెస్పెక్ట్ తగ్గిపోయిందంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఇప్పుడు ఒక హిట్ రావడంతో చిరంజీవినే లెక్క చేయ‌డం లేద‌ని - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను తేలిగ్గా తీసిప‌డేస్తున్నాడ‌ని మెగా అభిమానుల్లో ఓ వ‌ర్గం విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. బ‌న్నీ మీద చిరు అభిమానులు ఏ స్థాయిలో ఆగ్ర‌హంతో ఉన్నారో ఒక్కసారి సోషల్ మీడియాలో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి అర్థ‌మ‌వుతుంది. దీనికి తోడు మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ పై ఫ్యాన్స్ అడిగే దాకా బన్నీ స్పందించకపోవడం - పవన్ కళ్యాణ్ తనయుడికి విషెస్ చెప్పకపోవడం వల్ల మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజుకి చిరంజీవి విష్‌ కు బ‌దులుగా బ‌న్నీ పెట్టిన ట్వీట్ కింద కామెంట్లు చ‌దివితే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది.

అసలే బన్నీ ఇతర మెగా హీరోలను లెక్క చేయకుండా సొంతంగా ఇమేజ్ ట్రై చేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ లో బన్నీ ఇచ్చిన రిప్లై నిప్పు మీద కిరోసిన్ పోసినట్లుగా అయింది. వివరాల్లోకి వెళ్తే ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయా ఘోష‌ల్ అల్లు అర్జున్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ అత‌ణ్ని 'మెగాస్టార్‌'గా అభివర్ణించింది. దీనికి బ‌దులుగా బ‌న్నీ థ్యాంక్స్ చెప్పాడు. శ్రేయా ఘోషల్ మెసేజ్ చ‌దివి బ‌దులిచ్చిన బ‌న్నీ.. త‌న‌ను 'మెగాస్టార్' అని పిల‌వొద్ద‌ని, చిరుకు మాత్ర‌మే అది సొంత‌మ‌ని ఆమెకు చెప్ప‌కపోవ‌డాన్ని మెగా అభిమానులు త‌ప్పుబ‌డుతున్నారు. బ‌న్నీ అసలు శ్రేయాకు రిప్లై ఇవ్వకపోతే మెసేజ్ చ‌ద‌వ‌లేద‌నుకోవ‌చ్చు. కానీ.. రిప్లై ఇవ్వ‌డంతో త‌న‌ను తాను 'మెగాస్టార్‌'గా ఫీల్ అవుతున్నదంటూ చిరు ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఈమెతో పాటు క్రికెట‌ర్ రాహుల్ శ‌ర్మ‌.. కొంద‌రు ఉత్త‌రాది జ‌నాలు కూడా బ‌న్నీని మెగాస్టార్‌గా అభివ‌ర్ణిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. దీంతో అసలే అల్లు అర్జున్ పై మండి పడుతున్న చిరు ఫ్యాన్స్ ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. ఏదేమైనా మెగా హీరోలు కల్పించుకొని చెప్పినా కూడా ఈ ఫ్యాన్ వార్స్ ఆగేలా లేవు.