Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: మెహ్రీన్ బికినీ.. ఆకాశానికైనా ఊపిరాడ‌నివ్వ‌దు!

By:  Tupaki Desk   |   22 Dec 2020 2:30 PM GMT
ఫోటో టాక్:  మెహ్రీన్ బికినీ.. ఆకాశానికైనా ఊపిరాడ‌నివ్వ‌దు!
X
ఆ ఆకాశం అందం చూస్తుంటే ఊపిరాడ‌నివ్వ‌డం లేదు! అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ తో అదిరిపోయే బికినీ బీచ్ ఫోటోని షేర్ చేసింది మెహ్రీన్ ఫీర్జ‌ద‌. నీలాకాశం నీలి నింగి ఏక‌మ‌య్యే చోట సంగ‌మిస్తోందిలా మెహ్రీన్. వివ‌ర్ణం అయిన ఆ నీలి ఆకాశాన్ని న‌డిసంద్రం నుంచి వీక్షిస్తూ బికినీ యోగినినే త‌ల‌పించింది. ఊపిరాడ‌నివ్వ‌ని అంద‌మైన ఆకాశం అంటూ.. అద్భుత‌మైన వ‌ర్ణ‌న‌తో క‌ట్టిప‌డేసింది.

గ‌త కొంత‌కాలంగా ఎందుక‌నో ఈ అమ్మ‌డి సంద‌డి టాలీవుడ్ లో మిస్స‌య్యింది. ఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత నాగ‌శౌర్య స‌ర‌స‌న న‌టించిన సినిమా ఆశించిన రిజ‌ల్ట్ ని ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత అంత‌గా హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ లో క‌నిపించ‌లేదు. మ‌హ‌మ్మారీ క్రైసిస్ లో స్వ‌స్థ‌లంలోనే గ‌డిపేసింద‌ట‌.

ఇప్పుడు ఎఫ్ 2 టీమ్ తో తిరిగి జాయినైంది. ఎఫ్ 3 స‌న్నాహాల్లో ఉన్న అనీల్ రావిపూడితో క‌లిసి ఇటీవ‌లే బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే వేదిక‌పై సంద‌డి చేసింది. వేదిక‌పై మెహ్రీన్ ముగ్ధ‌మ‌నోహ‌ర సౌంద‌ర్యానికి యూత్ ఫిదా అయిపోయింది. ఇక ఇదే వేదిక‌పై మెహ్రీన్ ఓ మెడ్లీ సాంగ్ కి పెర్ఫామ్ చేసి గుండె కొల్ల‌గొట్టింది.

ఎఫ్ 3 ఈ అమ్మ‌డికి మ‌ళ్లీ కాంబ్యాక్ లాంటిదే అవుతుంది. ఇదేగాక వేరే ద‌ర్శ‌కులు వినిపిస్తున్న క‌థ‌లు వింటోందిట‌. ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. చేస్తే అధికారికంగా ఈ బ్యూటీనే చెబుతుంది‌. అప్ప‌టివ‌ర‌కూ ఇదిగో ఇలా ఇన్ స్టా వేదిక‌గా అదిరిపోయే ఫోటో వీడియో ట్రీట్ అందుబాటులో ఉంటుంద‌న్నమా‌ట‌.