Begin typing your search above and press return to search.

వార‌సుడికి ఆస‌క్తి లేక‌పోయినా న‌ట‌ శిక్ష‌ణ?

By:  Tupaki Desk   |   12 Feb 2020 6:00 AM GMT
వార‌సుడికి ఆస‌క్తి లేక‌పోయినా న‌ట‌ శిక్ష‌ణ?
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ అభిమానుల్లో నిరంత‌రం హాట్ టాపిక్. మోక్ష‌జ్ఞను పెద్ద స్టార్ గా చూడాల‌ని నంద‌మూరి ఫ్యామిలీ స‌హా అభిమానులు ఎంతో ఆశించారు. తాత ఎన్టీఆర్ న‌ట‌వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని నంద‌మూరి బాల‌కష్ణ పెద్ద స్టార్ అయితే..తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ మోక్షు పెద్ద స్టార్ కావాల‌ని అభిమానులు ఆకాంక్షించారు. కానీ మోక్షజ్ఞ‌కి యాక్టింగ్ పై ఆస‌క్తి లేక‌ పోవ‌డంతో ఈ రంగం వైపు వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువడ్డాయి.

మోక్ష‌జ్ఞ బాడీని ఫిట్ గా ఉంచకపోవ‌డం...చబ్బీ లుక్ తో ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో ఈ క‌థ‌నాల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ట‌య్యింది. నిజంగానే మోక్ష‌జ్ఞ‌కు యాక్టింగ్ అంటే ఆస‌క్తి లేద‌ని భావించాల్సి వ‌స్తోంద‌ని ఆ ఫోటోల ఆధారంగా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కించాయి. అయితే తాజాగా నంద‌మూరి కాంపౌండ్ నుంచి మోక్షజ్ఞ‌ ఎంట్రీ విష‌య‌మై ఆస‌క్తిక‌ర లీకులు అందాయి. మోక్ష‌జ్ఞను కుటుంబ స‌భ్యులంతా క‌లిసి న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేట‌ర్ ఇనిస్టిట్యూట్ కి పంపిస్తున్నారని తెలుస్తోంది. ఇది 12 వారాల యాక్టింగ్ ప్రొగ్రామింగ్ కోర్స్. యాక్టింగ్ పై స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకోనున్నాడ‌ట‌. న‌ట‌న‌కు సంబ‌ధించిన మెల‌కువ‌లు..స్టైల్ ఆఫ్ యాక్టింగ్.. ఎలాంటి పాత్ర‌లో నైనా ఒదిగి పోయే విధంగా త‌యారు చేసి పంపిస్తారుట‌.

త్వ‌ర‌లోనే న్యూయార్క్ కి ప‌య‌నం కానున్నాడ‌ని స‌మాచారం. దాదాపు స్టార్ కిడ్స్ అంతా ఈ ఇనిస్టిట్యూట్ లోనే త‌ర్ఫీదు పొందిన వారే. బాలీవుడ్..టాలీవుడ్ స‌హా ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నుంచి చాలా మంది ఈ స్కూల్ లో శిక్ష‌ణ పొంది స్టార్లుగా ఎదిగారు. అక్క‌డి వాతావ‌ర‌ణం న‌ట‌న‌పై శ్ర‌ద్ధ‌.. రాణించాల‌న్న క‌సి ప‌ట్టుద‌ల పెంచే విధంగా మార్చేస్తాయట‌. ఇక్క‌డ వ్య‌క్తిగ‌త శిక్ష‌కులు అందుబాటులో ఉంటారట‌. అయితే ఈ శిక్ష‌ణ మోక్ష‌జ్ఞ ఆస‌క్తి గా ఎటెండ‌వుతున్నాడా? లేక‌ కుటుంబ స‌భ్యుల ప్రోద్భ‌ల‌మా? అన్న‌ది త‌నే చెప్పాల్సి ఉంటుంది. న‌ట‌శిక్ష‌ణ‌తో ఈ రంగంపై ఆస‌క్తి పెంచుకుంటాడ‌ని ఫ్యామిలీ భావిస్తోందా? అస‌లేం జ‌రుగుతోంది? అన్న ఆస‌క్తి ప‌రిశ్ర‌మ‌లో అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే తామ‌ర‌ తంప‌ర‌గా మోక్ష‌జ్ఞ‌ పై సాగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్టేందుకు నంద‌మూరి ఫ్యామిలీ అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.