Begin typing your search above and press return to search.

కామెడీ విల‌న్ జీవితంలో ఊహించ‌ని విప‌త్తు

By:  Tupaki Desk   |   12 Aug 2020 8:10 AM GMT
కామెడీ విల‌న్ జీవితంలో ఊహించ‌ని విప‌త్తు
X
ఆయ‌న నున్న గుండు .. నేచుర‌ల్ పెర్ఫామెన్స్ కి ఫిదా అవ్వ‌ని వాళ్లు ఉండ‌రు. తెర‌పై క‌నిపిస్తే ఫ‌క్కున నవ్వేస్తారు. అత‌డు కోలీవుడ్ టాలీవుడ్ లో త‌న‌దైన న‌ట‌న‌తో ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటే.. మొట్టై రాజేంద్రన్. ఆయ‌న‌ తమిళ సినిమాలో స్టంట్ మ‌న్ (డూప్) గా తన కెరీర్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. స్టంట్ డూప్ విన్యాసాల‌తో ఆక‌ట్టుకుని అటుపై ప‌లువురు ద‌ర్శ‌కుల క‌ళ్ల‌లో ప‌డ్డాడు. అలా అతడికి శివ‌పుత్రుడు (పితామ‌గ‌న్ -త‌మిళం)లో అవ‌కాశం ఇచ్చారు బాలా.

బాలా అటుపైనా వ‌రుస‌గా అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు. ది గ్రేట్ బాలా తెర‌కెక్కించిన వాడు వీడు (నాన్ కడావుల్) లో ముట్టై ఓ విలన్ పాత్ర పోషించి మెప్పించాడు. గుండుతో వెరైటీ ఆహార్యంతో ముట్టై రాజేంద్ర‌న్ న‌ట‌న‌కు పేరొచ్చింది. ఆ తరువాత అతను చాలా వేగంగా కెరీర్ ప‌రంగా ఎదిగాడు. కామెడీ విల‌నీతో మ‌రింత‌గా మెప్పించాడు. 2003 లో కెరీర్ ప్రారంభించిన అత‌డు ఇప్పటివరకు 500 కి పైగా చిత్రాలలో నటించారు. అయితే అత‌గాడి వ్య‌క్తిగ‌త జీవితంలో ఊహించ‌ని విప‌త్తు త‌లెత్తింద‌ట‌.

అలోపేసియా యూనివర్సాలిస్ అనే అరుదైన వ్యాధికి గుర‌వ్వ‌డంతో అతడి ఒంటిపై జుట్టు అంతా నెమ్మ‌దిగా రాలిపోతోంద‌ట‌. ఓ పోరాట సన్నివేశాలలో ఒక విష పదార్థం మీద ప‌డ‌డంతో ఇలాంటి ప్ర‌భావం చూపుతోంద‌ట‌. తాజాగా ముట్టై రాజేంద్ర‌న్ నిండైన‌ జుట్టుతో క‌నిపిస్తున్న ఓ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అందులో మోహ‌న్ లాల్ తో స‌ద‌రు కామెడీ విల‌న్ క‌లిసి ఉన్నారు‌. నిజానికి అత‌డికి ఏర్ప‌డిన ఊహించ‌ని స‌మ‌స్య వ‌ల్ల‌నే జుట్టు రాలిపోయింది. కానీ ఆ రూప‌మే న‌టుడిగా క‌లిసొచ్చింది. అనూహ్యంగా అవ‌కాశాల్ని పెంచింది. విధివైచిత్రి అంటే ఇదేనేమో!