Begin typing your search above and press return to search.

మీసం మెలేస్తూ సర్ప్రైజ్ చేసిన ఎన్టీఆర్.. ఎందుకంటే??

By:  Tupaki Desk   |   22 March 2021 10:30 AM GMT
మీసం మెలేస్తూ సర్ప్రైజ్ చేసిన ఎన్టీఆర్.. ఎందుకంటే??
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఫుల్ స్వింగులో ఉన్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాలిటీ షో షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే ఇదివరకు బిగ్ బాస్ రియాలిటీ షోతో బుల్లితెర పై అలరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'తో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోతో అందరు రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉండండి.. త్వరలోనే డేట్ ప్రకటించనున్నట్లు తెలిపింది ప్రోగ్రాం యాజమాన్యం. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదవ సీజన్‌ ప్రోమోలో ‘ఇక్కడ కథ మీది కల మీది.. జీవితాన్ని మారుద్దాం రా.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ ఎన్టీఆర్ మీసం మెలేసి చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.

అయితే త్వరలో ఈ షోకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మొదలు కానున్నాయి. ఇందులో అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన వాళ్లకి కోటి రూపాయిలు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకూ మొత్తం నాలుగు సీజన్లు పూర్తి కాగా.. ఐదవ సీజన్‌ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండటంతో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' టీవీ ద్వారా స్ఫూర్తి పొంది తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రారంభించారు. 1-3 సీజన్ల వరకు కింగ్ నాగార్జున హోస్ట్ చేయగా.. నాలుగవ సీజన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇప్పుడు ఐదవ సీసన్ గురించి టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ప్రారంభం కానుంది. అయితే ఎన్టీఆర్ షోతో పాటు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడని టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.