Begin typing your search above and press return to search.

NTR 31: టైటిల్ తోనే నీల్ స్ట్రాటజీ?

By:  Tupaki Desk   |   5 Jun 2022 8:05 AM GMT
NTR 31: టైటిల్ తోనే నీల్ స్ట్రాటజీ?
X
సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసి ప్రేక్షకులలో అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. కేవలం ఒక పోస్టర్ ద్వారానే సినిమా అంచనాలకు మించి ఉంటుంది అనేలా దర్శకుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఐతే క్రియేట్ చేశాడు.

కేజిఎఫ్ సలార్ సినిమాల తరహాలోనే మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను రూపొందించడానికి ప్రశాంత్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దర్శకుడు తన కెరీర్ మొదటి నుంచి కూడా ప్రతి సినిమా విషయంలో ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. సినిమా మొదటి పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో ఒక బలమైన ముద్ర వేయాలని ఆలోచిస్తూ ఉంటాడు.

కేజిఎఫ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే టైటిల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ప్రభాస్ సలార్ సినిమా విషయంలో కూడా అదే తరహాలో ముందుకు సాగాడు. ఆ సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులల్9 ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తర్వాత షూటింగ్ ఆలస్యం అయినా కూడా సినిమాపై బజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఇంకా అదే తరహాలో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది. అసురుడు అనే టైటిల్ అయితే సినిమా కథ కు కరెక్టుగా సరిపోతుంది అని అలాగే జనాల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది అని కూడా ప్రశాంత్ నీల్ ఆలోచించాడట. ఇప్పటికే అసురుడు టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. కాబట్టి దాదాపు ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్లో మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు అనంతరం ప్రశాంత్ సినిమా మొదలు పెట్టానున్నాడు.