Begin typing your search above and press return to search.
నెట్టింట్లో అడుగు పెట్టిన పవర్ స్టార్ అత్త
By: Tupaki Desk | 7 April 2020 7:00 AM GMTపవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ అత్త పాత్రలో నటించింది నటి నదియా. 'మిర్చి' చిత్రంతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన నదియా....పవన్ సినిమాతో పెద్ద స్టార్‌గా మారి పోయింది. దీంతో ఆమెను తమ చిత్రాల్లో తీసుకోవాలని నిర్మాణ సంస్ధలు పోటీ ఆసక్తి చూపారు. ఒక టైంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఊపేసిన నదియాకి వివాహంతో గ్యాప్ వచ్చింది. చాలా కాలం తర్వాత రీఎంట్రీతో మళ్లీ బిజీ అయిపోయింది. నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది. నదియా 'మిర్చి'లో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా చూసిన వారు నదియాకు ప్రత్యేకంగా మార్కులు వేశారు. ఆ తర్వాత నదియా పవన్ కల్యాణ్ కు అత్తగా నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో సమంతకు తల్లిగా నటించింది. ఇందులో కూడా ఆధునిక భావాలున్న మహిళగానే నదియా కనిపించి అలరించింది. తర్వాత 'దృశ్యం','అ ఆ' 'నా పేరు సూర్య.. నా ఇళ్లు ఇండియా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 1994లో సినీ పరిశ్రమకు దూరమయ్యాక.. 2004లో తమిళంలో ఎన్.కుమరన్ సన్ ఆఫ్ మహలక్ష్మీ చిత్రంతోనే మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.
మన సినీ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు రీసెంటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాడు. వచ్చీ రావడంతోనే సోషల్ మీడియాలలో పోస్టుల వర్షం కురిపిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నటిస్తుండటంతో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ అయింది. షూటింగులు లేక ఖాళీగా ఉన్న సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు నదియా కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టింది. తను నటించిన ఓల్డ్ మలయాళ సినిమాలోని ఒక పిక్ షేర్ చేసింది. దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 9 పిఎం 9 మినిట్స్ టాస్క్‌లో ఆమె పాల్గొని.. 'చీకటి సమయాల్లో కాంతిని కోరుకుంటున్నాను' అని చెప్పడానికి ఆమె బాల్కనీలో కొవ్వొత్తితో నిలబడి ఉన్న ఫోటో కూడా పోస్ట్ చేసింది. నదియా కూడా ఇంస్టాగ్రామ్ లో ఎంటర్ అవడంతో నెటిజన్లు ఆమెకు వెల్కమ్ చెప్తున్నారు. సినిమాల్లో రీఎంట్రీతో అదరగొట్టిన నదియా సోషల్ మీడియాలో కూడా హవా కొనసాగిస్తుందేమో చూడాలి.