Begin typing your search above and press return to search.

నాగశౌర్యం.. పరాక్రమం.. దుమ్ములేపుతున్న కటౌట్

By:  Tupaki Desk   |   2 Jan 2021 1:30 PM GMT
నాగశౌర్యం.. పరాక్రమం.. దుమ్ములేపుతున్న కటౌట్
X
నిన్నామొన్నటి వరకూ నటించిన చిత్రాల్లో సాఫ్ట్ లుక్ తో లవర్ బాయ్ లా కనిపించిన నాగశౌర్య.. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ లో దర్శనమిస్తున్నాడు. కండలు తిరిగిన దేహం.. రింగులు పొదిగిన జులపాలతో.. శౌర్య కటౌట్ దుమ్ములేపుతోంది. లేటెస్ట్ తెరకెక్కుతున్న మూవీలోని ఈ స్టిల్.. నెటిజన్లను ఆకట్టకుంటోంది.

నాగశౌర్య హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో.. ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో.. స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్ర చివరిషెడ్యూల్ ఈ నెల 4 నుండి ప్రారంభంకానుందని చిత్రయూనిట్‌ ప్రకటించింది. కాగా.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కుడి చేతికి కట్టు కట్టుకుని, జులపాలను చేత్తో వెనక్కి లాగి, ఇంటెన్స్ లుక్‌ ఇస్తున్న శౌర్య పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన స్టన్నింగ్‌ ఫస్ట్‌లుక్ ఆడిన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ‘ది గేమ్ విల్ నెవర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని, వారియర్ పోజ్ లో నాగశౌర్య ఉన్న లుక్‌ మైండ్ బ్లోయింగ్ అనిపించింది.

కాగా.. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మాతలు నారయణదాస్ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.