Begin typing your search above and press return to search.
ఆ యువ హీరో కెరీర్ డేంజర్ జోన్ లో పడిందా...?
By: Tupaki Desk | 4 July 2020 7:30 AM GMTమహమ్మారి ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోల పరిస్థితి ప్రశ్నర్థకంగా మార్చింది. ఇండస్ట్రీలో తామేంటో నిరూపించుకోడానికి ట్రై చేస్తున్న వారు కొందరైతే.. ప్లాపులతో సతమవుతున్న వారు మరికొందరు. ఇక చాక్లెట్ బాయ్ నాగ శౌర్య సిచ్యుయేషన్ కూడా కొంచెం అటు ఇటుగా ఉందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. 'ఊహలు గుసగుసలాడే' 'కల్యాణ వైభోగమే' 'ఛలో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శౌర్య. కానీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి బొక్కబోర్లా పడ్డాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. యూత్ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. అయినా పట్టు విడువకుండా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో 'అశ్వథ్థామ' అనే సినిమాను తనే స్వయంగా స్టోరీ రాసి నిర్మించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయిందట. దీంతో వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు శౌర్య. అయితే మహమ్మారి వైరస్ వచ్చి బ్రేక్స్ వేసింది.
కాగా నాగశౌర్య మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్న ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని ప్రకటించారు. అయితే ఇంత వరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై సితార వారు సెకండ్ థాట్ లో ఉన్నారట. క్రైసిస్ వల్ల ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కి ఇప్పుడు బడ్జెట్ కేటాయించడమే కష్టంగా ఉందని.. దీంతో శౌర్య కంటే ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేసి తరువాత ఇది చూద్దాం అనే ఆలోచనలో ఉన్నారట. అలానే 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు శౌర్య. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా వారు నిర్మించనున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేపథ్యం మొత్తం అమెరికా నుంచి ఇండియాకి మార్చాలట. అలా చేస్తే కథ లో ఫీల్ పోయే అవకాశం ఉందని భావించి.. ఏం చేయాలో తెలియక ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టేసి 'కార్తికేయ' సీక్వెల్ మీద దృష్టి పెట్టాలని నిర్మాతలు అనుకుంటున్నారట.
అంతేకాకుండా భవ్య క్రియేషన్స్ వారితో కమిటైన సినిమా మధ్యలోనే ఆగిపోయిందట. కాకపోతే నాగ శౌర్యతో ఆసియన్ సునీల్ మరియు శరత్ మరార్ కమిటైన ప్రాజెక్ట్స్ మాత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసియన్ సునీల్ ప్రాజెక్ట్ కోసం శౌర్య సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడట. అయితే తనకి కలిసి వచ్చిన లవర్ బాయ్ ట్రాక్ వదిలేసి ఈ మాస్ ఇమేజ్ కోసం శౌర్య ట్రై చేయడం వల్లనే శౌర్య కెరీర్ కి డేంజర్ అనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య వినిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో శౌర్య సక్సెస్ సాధించి మళ్ళీ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.