Begin typing your search above and press return to search.

రామూ.. శివ సీక్వెల్‌ కథ ఇవ్వవయ్యా

By:  Tupaki Desk   |   10 Sep 2015 5:24 AM GMT
రామూ.. శివ సీక్వెల్‌ కథ ఇవ్వవయ్యా
X
అక్కినేని నాగార్జున హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన కల్ట్‌ సినిమా శివ 90లలో ట్రెండ్‌ సెట్టర్‌ అన్న సంగతి తెలిసిందే. కాలేజ్‌ స్టూడెంట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ సంచలనం. కాలేజీ కుర్రాళ్లు చైన్‌ తెంచి దాడులకు తెగబడిన సందర్భాలున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతటి ఇన్‌ ఫ్లూయెన్స్‌ ఉన్న ఈ సినిమాకి సీక్వెల్‌ తీయాలన్న ఆలోచన ఇంతకాలం ఎందుకు రాలేదు? .. అందుకే నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ జోడీ ఇప్పటికే ఈ సినిమా గురించి సీరియస్‌ గా ఆలోచిస్తున్నారని సమాచారం. ''నేను, అమల శివలో నటించాం. కానీ ఇప్పుడు చైతన్య, అఖిల్‌ ఉన్నారు. కాబట్టి అలాంటి ఫ్యామిలీ కథ కోసం వేచి చూస్తున్నాం. సీక్వెల్‌ చేస్తా''మని నాగార్జున అన్నారు.

శివ సినిమాలో నాగార్జున అమలని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రియల్‌ లైఫ్‌ లోనూ అదే జరిగింది. కానీ ఆ సినిమాలో హీరోకి పిల్లలు లేరు. ఇప్పుడు రియల్‌ లైఫ్‌ లో నాగచైతన్య, అఖిల్‌ అనే ఇద్దరు తనయులున్నారు. కాబట్టి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తెరపై ఆవిష్కరిస్తూ ఇప్పటి ట్రెండ్‌ ని అనుసరించి కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో అదిరిపోయే స్క్రిప్ట్‌ రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే నాగార్జున రామ్‌ గోపాల్‌ వర్మని కథ రెడీ చేయమని చెప్పారు. రామూ ఆ పనిలోనే ఉన్నారని సమాచారం.

ఒకవేళ శివ సీక్వెల్‌ తెరకెక్కితే అది 'శివ'ని మించి, 'మనం' రికార్డుని తిరగరాసే ట్రెండ్‌ సెట్టర్‌ కావాల్సి ఉంటుంది. ఏఎన్నార్‌ లేకపోయినా ఆల్ మోస్ట్‌ అక్కినేని ప్యామిలీ మెంబర్స్‌ అంతా ఒకే ఫ్రేములో కనిపించబోతున్నారు కాబట్టి ఇది టాలీవుడ్‌ లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాల్సిందే. అప్‌ డేట్స్‌ కోసం వెయిట్‌ అండ్‌ సీ..