Begin typing your search above and press return to search.
బిబిలో సౌందర్యను గుర్తు చేసిన నాగార్జున
By: Tupaki Desk | 2 Nov 2020 7:10 AM GMTతెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఆట పాటలతో సరదాగా సాగిపోయింది. శనివారం ఎపిసోడ్ లో పెరిగిన హీట్ ను నిన్నటి ఎపిసోడ్ లో చల్లార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. ఇంటి సభ్యులు రెండుగా విడిపోయి పాటకు సంబంధించిన ట్యూన్ వస్తే దాని పాటను గుర్తించాలి. అలా ఎక్కువ పాటలను గుర్తించిన వారు విజేతలు. హలో బ్రదర్ లోని ప్రియ రాగాలే.. ట్యూన్ వినిపించిన సమయంలో అభిజిత్ టీం ఆ పాటను గుర్తు పట్టేసింది. ఆ పాట వస్తున్న సమయంలో అమ్మ రాజశేఖర్ మరియు హారికలు డాన్స్ చేశారు. వారు వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తో వేసిన స్టెప్పులు అందరిని మెప్పించాయి.
ఈ పాట సందర్బంగా నాగార్జున హలో బ్రదర్ రోజులకు వెళ్లాడు. ఆ సమయంలో మొదటి సారి సౌందర్యను కలిశాను. హలో బ్రదర్ సినిమా ను ప్రియరాగాలే పాట షూట్ తో మొదలు పెట్టాము. షూటింగ్ స్పాట్ లో సౌందర్యను మొదటి సారి కలిశాను. ఈ పాట విన్న ప్రతి సారి ఆమె గుర్తుకు వస్తారంటూ నాగ్ చెప్పుకొచ్చారు. 1994లో వచ్చిన హలో బ్రదర్ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్ గా నిలిచాయి. రాజ్.. కోటి ద్వయం ఈ సినిమాకు పాటలు అందించారు. మాస్ క్లాస్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా పాటలు ఉంటాయి అనడంలో సందేహం లేదు.
ఈ సందర్బంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ఆ పాటలో వెనుక ఉన్న డాన్సర్స్ లో నేను ఉన్నాను. అప్పట్లో నేను గ్రూప్ డాన్సర్స్ ల్లో ఒక్కడిగా ఉన్నాను. పాట షూటింగ్ చివరి రోజు నేను కూడా పాల్గొన్నాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉంది అంటూ అమ్మ రాజశేఖర్ ఎమోషన్ అయ్యాడు. అప్పటి స్టెప్పులు మీకు ఇంకా గుర్తు ఉన్నాయా మాస్టర్ అంటూ నాగార్జున ప్రశంసించాడు. మొత్తానికి నిన్నటి షో లో హలో బ్రదర్ సినిమా గురించి సౌందర్య గురించి కొంత సమయం చర్చ జరిగింది.