Begin typing your search above and press return to search.

‘రత్నం’లాంటి నందమూరి జంట

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:53 AM GMT
‘రత్నం’లాంటి నందమూరి జంట
X
ఇండస్ట్రీలో చాలామంది తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతుంటారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు.. వారి ఫొటోలు కూడా సీక్రెట్ గానే ఉంచుతుంటారు. ఈమధ్య కాలంలో ఈ ట్రెండ్ కాస్త మారుతోంది. అల్లు అర్జున్ - ఎన్టీఆర్ వంటివారు తమ జీవితంలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఈ కేటగిరీలో ఇప్పుడింకో నందమూరి హీరో చేరాడు.

నందమూరి తారకరత్న రీసెంట్ గా తన భార్య అలేఖ్య రెడ్డితో తీయించుకున్న ఫొటో బయటకొచ్చింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఈ కపుల్ సందడి చేశారు. ట్రెడిషనల్ డ్రస్ లో క్లాసిక్ లుక్ లో కనిపించిన వీరిద్దరూ క్యూట్ కపుల్ గా అందరి ప్రశంసలు అందుకున్నారు. అయిదేళ్ల క్రితం తారకరత్న అలేఖ్య రెడ్డిని పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాడు. వీళ్ల పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడానికి కారణం ఇంటర్ క్యాస్ట్ అని కాదు.. అలేఖ్య రెడ్డి అప్పటికే డైవోర్సీ. అయినా సరే... తారకరత్న పట్టుపట్టి ఈ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమకు ప్రతిఫలంగా నాలుగేళ్ల పాప నిషా ఉంది. అలేఖ్యను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటని తారకరత్న చెబుతుంటాడు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్పే. కానీ పెళ్లయ్యాక కూడా ఆ ప్రేమను నిలబెట్టుకుని జీవితంలో సంతోషంగా బతకడం అన్నది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో తారకరత్న రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆల్ ది బెస్ట్ టు ది క్యూట్ కపుల్.