Begin typing your search above and press return to search.
కృష్ణార్జున యుద్దం మొదలైంది!!
By: Tupaki Desk | 8 Aug 2017 4:57 PM GMTనేచురల్ స్టార్ నాని.. అదేదో న్యాచురల్ గా చెట్లకు కాయలు కాసినట్లు.. ఏడాది పొడుగునా అరటి పళ్ళ గెలలు ఇరగేసినట్లు.. మనోడు సంవత్సరమంతా సినిమాలు చేస్తూనే ఉంటాడు. అదిగో ఒక సినిమా రిలీజయ్యేనాటికే మరో సినిమా షూటింగ్ సగంలో ఉంటుంది. ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అనుకుంటే వెంటనే మరో సినిమాను సెట్ చేసి సెట్ మీదకు ఎక్కిస్తాడు.
ప్రస్తుతం నాని 'ఎంసిఎ' ఎలియాస్ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది అనగా మనోడు మరో సినిమాను పట్టాలెక్కించాడు. వెంకటాద్రి ఎక్సప్రెస్.. ఎక్సప్రెస్ రాజా సినిమాలను తీసిన మేర్లపాక గాంధి డైరక్షన్లో ఇప్పుడు నాని ''కృష్ణార్జున యుద్దం'' అనే సినిమాను చేస్తున్నాడు. తన కెరియర్లో రెండోసారి ఈ సినిమా కోసం ద్విపాత్రాభినయం చేస్తున్నాడులే. ఒక బైక్ మీద కృష్ణుడి ఫ్లూట్ పెట్టుకుని వెళ్తున్న ఫోటోను ఒకటి షేర్ చేస్తూ.. ఈ సినిమా షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పాడు నాని.
ఇకపోతే ఎంసిఎ సినిమాను అప్పట్లో ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణు శ్రీరాం తీస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో చేస్తున్న ఈ సినిమా కూడా ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామానే. అంటే ఆల్రెడీ మొన్ననే నేను లోకల్ సినిమాతో బాక్సాఫీస్ ను దంచేసిన దిల్ రాజు అండ్ నాని కాంబినేషన్ ఇప్పుడు మరోసారి అదే రిపీట్ చేస్తుందనమాట. అది సంగతి.