Begin typing your search above and press return to search.

చిరు క‌న్నా ప‌వ‌న్ బెస్ట్‌..టీవీ న‌టి షాక్‌!

By:  Tupaki Desk   |   4 Aug 2017 1:58 PM GMT
చిరు క‌న్నా ప‌వ‌న్ బెస్ట్‌..టీవీ న‌టి షాక్‌!
X
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నవ‌స‌రం లేదు. ఆయ‌నకు కోట్లాది మంది అభిమానులున్నారు. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ లో ఆయ‌న బ్ల‌డ్ బ్యాంక్ న‌డిపితే.. చిరు అభిమానులు ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేవారు. అనంత‌రం రాజ‌కీయాల్లోకి కూడా వ‌చ్చారు. రాజ్య‌స‌భ స‌భ్యుడి దాకా వెళ్లారు. అటువంటి వ్య‌క్తిపై ఓ టీవీన‌టి షాకింగ్ కామెంట్స్ చేసింది. చిరంజీవి వ్య‌క్తిగ‌త జీవితం అంటే త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. ఆమె వ్యాఖ్య‌ల‌పై మెగా అభిమానులు మండిప‌డుతున్నారు.

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా టీవీ న‌టి నీతూ నారాయ‌ణ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. మీ అభిమాన హీరో ఎవరనే అనే ప్రశ్నకు ఆమె షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. ముందు ప్ర‌శ్న‌ కరెక్ట్ గా అడగడం నేర్చుకోండని యాంక‌ర్ కు నీతూ చెప్పింది. 'పవన్ కల్యాణ్ తర్వాత మీ అభిమాన హీరో ఎవరు?' అని అడగాలని నీతూ చెప్పింది. త‌న‌కు పవన్ కల్యాణ్ అంటే చాలా అభిమాన‌మ‌ని, ఆయన తర్వాత చిరంజీవిని అభిమానిస్తానని చెప్పింది. ఇంత‌టితో ఆగ‌కుండా మ‌రిన్ని వ్యాఖ్య‌లు చేసింది. యాక్టింగ్ పరంగా చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, చిరంజీవి పర్సనల్ లైఫ్ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పింది.

పవన్ కల్యాణ్ పెద్ద స్టార్ అని తాను అభిమానించడం లేదని, ఇతరులకు మంచి చేయాలనే గొప్ప గుణం పవన్ లో ఉందని నీతూ కితాబిచ్చింది. అందుకే పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అని తేల్చి చెప్పింది. సినిమాలు హిట్ అయినంత మాత్రాన పెద్ద హీరోలు కాదని... హెల్పింగ్ నేచర్ ఉన్నవారే రియల్ హీరో అని నీతూ అంది. స‌మ‌స్య‌ల‌పై పవన్ కల్యాణ్ వెంటనే స్పందిస్తారని, కష్టాల్లో ఉన్న సీనియర్ నటులకు ఆయ‌న సాయం చేసిన‌ట్లు తాను విన్నానని చెప్పింది. పెద్ద హీరోగా చెలామణి అవుతూ, ఎంత డబ్బు సంపాదించినా ఏం ఉప‌యోగం లేద‌ని చెప్పింది. కొంత మంది యంగ్ హీరోలు ఒకటి - రెండు సినిమాలు చేసి సూపర్ స్టార్లుగా ఫీల్ అయిపోతున్నారని అంది. మొత్తానికి నీతూ కామెంట్స్ మెగా అభిమానుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.