Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ కి తెలివిగా అమ్మేశారంటూ..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 12:30 PM GMT
నెట్ ఫ్లిక్స్ కి తెలివిగా అమ్మేశారంటూ..!
X
పైకి క‌నిపించేదంతా నిజ‌మ‌ని న‌మ్మ‌డానికి లేదు. పోస్ట‌ర్ల హంగామా టీజ‌ర్లు ట్రైల‌ర్లతో హ‌డావుడి చూసి భారీ అంచ‌నాల‌కు వెళితే దాని ప్ర‌భావం ప్రాక్టిక‌ల్ గా అంతే ఘోరంగా ఉంటుంద‌ని చాలా సినిమాలు నిరూపించాయి. గ‌త కొన్నేళ్ల‌లో భారీ అంచ‌నాల‌తో విడుద‌లై థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్లుగా నిలిచిన సినిమాలెన్నో. ఇప్పుడు అదే కోవ‌లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన‌ జ‌గమేతంత్రం (జ‌గ‌మే తందిరం) రిపోర్ట్ షాక్ కి గురి చేస్తోంది.

ధ‌నుష్ లాంటి స్టార్ హీరో న‌టించిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వహించారు. శ‌శికాంత్ నిర్మించారు. భారీ మొత్తాన్ని వెచ్చించి నెట్ ఫ్లిక్స్ వాళ్లు కొనుక్కున్నారు. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే రివ్యూలు వ‌చ్చేశాయి. అయితే ఈ సినిమా చూసిన వాళ్లంతా ధ‌నుష్ కెరీర్ లోనే చెత్త సినిమా అంటూ కౌంట‌ర్లు వేయ‌డం షాకిస్తోంది.

రిలీజ్ ముందే నెట్ ఫ్లిక్స్ వ‌ర్గాలు క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. పోస్ట‌ర్లు చూసి అబ్బో ఇది ఎంతో గొప్ప మూవీ కాబోతోందోన‌ని అనుకున్నారు. తీరా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొద‌ల‌య్యాక గంట సినిమాకే జ‌నం గ‌గ్గోలు పెట్టామ‌ని వ్యాఖ్య‌ల్ని గుప్పిస్తున్నారు. నిర్మాత చాలా తెలివిగా నెట్ ఫ్లిక్స్ వాళ్ల‌కు అంట‌గ‌ట్టారు అని మీమ్స్ ని షేర్ చేస్తున్నారు. నిజానికి అవెంజ‌ర్స్ ద‌ర్శ‌కులు రస్సో బ్ర‌ద‌ర్స్ అంత‌టివారే ఈ సినిమాపై ట్వీట్టు వేయ‌డంతో నిజంగానే ధ‌నుష్ మ‌రో సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నాడ‌ని భావించిన వారికి షాక్ త‌గిలింది. సీన్ అంతా రివ‌ర్స‌య్యింది. చేసిన ప‌బ్లిసిటీకి సినిమాలో కంటెంట్ కి ఏమాత్రం పొంత‌న లేద‌న్న కామెంట్లు సోష‌ల్ మీడియాల్లో వినిపిస్తున్నాయి. క‌రోనా వ‌ల్ల ఆగింది కానీ.. ఇలాంటి సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ఉంటే పంపిణీ వ‌ర్గాల‌కు ర‌క్త క‌న్నీళ్లే అని కామెంట్లు చేస్తున్నారు కొంద‌రైతే. ఇక ధ‌నుష్ త‌దుప‌రి అవెంజ‌ర్స్ ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తున్న‌ ది గ్రేమ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులోనూ ధ‌నుష్ ఓ చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.