Begin typing your search above and press return to search.
స్టార్ హీరో కపుల్ నిర్మించిన సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
By: Tupaki Desk | 7 April 2022 2:30 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య మరియు ఆయన భార్య జ్యోతిక నిర్మించిన 'ఓ మై డాగ్' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఓటీటీ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వారు మొదటే ప్రకటించారు. అన్నట్లుగానే సినిమా ను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు అయ్యింది.
పలు వాయిదాల తర్వాత ఓ మై డాగ్ సినిమా ను ఏప్రిల్ 21న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో అమెజాన్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. స్టార్ హీరో సూర్య నిర్మించిన సినిమా అవ్వడంతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అరుణ్ విజయ్ తనయుడు అర్నవ్ విజయ్ కూడా ఈ సినిమాలో నటించాడు. రియల్ లైఫ్ తండ్రి కొడుకులు అయిన వీరిద్దరు సినిమాలో కూడా అదే రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లో అరుణ్ విజయ్ తండ్రి విజయ్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో తమిళ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.
మూడు జనరేషన్స్ వారు కలిసి నటించిన సినిమా అవ్వడంతో పాటు సూర్య మరియు జ్యోతిక లు నిర్మించిన సినిమా అవ్వడం తో ఓ మై డాగ్ సినిమా చాలా స్పెషల్ గా నిలుస్తుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీ రావడంతో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు ఈ సినిమా పై చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నామంటున్నారు.
సూర్య తన సొంత బ్యానర్ లో విభిన్నమైన కథలను మరియు సబ్జెక్ట్స్ ను ఎంపిక చేసుకుని సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఆయనకు నిర్మాతగా కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పటికే ఆయన నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఓ మై డాగ్ సినిమా తో ఖచ్చితంగా మరో సారి నిర్మాతగా సూర్య సూపర్ హిట్ అవుతాడేమో అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.