Begin typing your search above and press return to search.
హాలీవుడ్ మూవీలో మన సూపర్ స్టార్
By: Tupaki Desk | 6 Nov 2020 2:30 AM GMTఇండియన్ స్టార్ హీరోలకు ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈమద్య కాలంలో వరుసగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లను చేస్తూ యూనివర్శిల్ హీరోయిన్ గా పేరు దక్కంచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా హాలీవుడ్ స్టార్ అవ్వబోతున్నాడు. అందుకు గాను మొదటి స్టెప్ పడుతోంది. హృతిక్ రోషన్ ఒక హాలీవుడ్ సినిమాలో నటించేందుకు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించబోతున్న ఆ సినిమా కోసం కొన్ని నెలల క్రితమే ఆడిషన్స్ లో హృతిక్ రోషన్ పాల్గొన్నాడు. ఆ సమయంలో వారు సంతృప్తి చెందడంతో పాటు ఈమద్య కాలంలో పలు సార్లు ఆన్ లైన్ ద్వారా కూడా హృతిక్ రోషన్ తో వారు మాట్లాడి చివరకు సినిమాను కన్ఫర్మ్ చేశారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందట.
ఇంగ్లీష్ మూవీలో స్పైగా హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈయన వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. మరో వైపు క్రిష్ 4 సినిమాలో కూడా హృతిక్ రోషన్ నటించబోతున్నాడు. హృతిక్ రోషన్ మొదటి హాలీవుడ్ మూవీ 2021లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. మన స్టార్ లు ఎవరు కూడా ఈమద్య కాలంలో హాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేసింది లేదు. హృతిక్ రోషన్ అక్కడ హిట్ అయితే ఖచ్చితంగా సంచలనమే.