Begin typing your search above and press return to search.

'పాగల్' ఫస్ట్ లుక్: ట్రెండీ న్యూ అవతార్ లో 'మాస్ కా దాస్'

By:  Tupaki Desk   |   2 Feb 2021 5:00 AM GMT
పాగల్ ఫస్ట్ లుక్: ట్రెండీ న్యూ అవతార్ లో మాస్ కా దాస్
X
టాలీవుడ్ యువ హీరో 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "పాగల్". 'ఫలక్ నుమా దాస్' 'హిట్' వంటి వరుస హిట్ చిత్రాలతో జోష్ మీదున్న విశ్వక్.. రెట్టింపు ఉత్సాహంతో ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నాడు. న‌రేష్ కొప్పల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా 'పాగల్' ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

'పాగల్' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశ్వక్ సేన్ ట్రెండీ అవుట్ ఫిట్స్ తో ఉబర్ కూల్ గా కనిపిస్తున్నాడు. ఇందులో విశ్వక్ రెండు చేతులు చాపి ఫోజ్ ఇవ్వగా.. బ్యాగ్రౌండ్ లో గులాబీ పూలు స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా నిలుస్తున్నాయి. ఇది యువ హీరో కెరీర్ లో 5వ చిత్రంగా రానుంది. ఈ చిత్రానికి మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా.. గ్యారీ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నాడు.