Begin typing your search above and press return to search.

'సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా' అని పాడుకుంటున్న 'పాగల్'

By:  Tupaki Desk   |   1 April 2021 2:21 PM GMT
సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా అని పాడుకుంటున్న పాగల్
X
యంగ్ హీరో 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం "పాగల్". న‌రేష్ కొప్పల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పాగల్' నుండి 'సరదాగా కాసేపైనా' అనే రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసారు.

'ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే.. ఇవ్వాళ ఎవ్వరు పంపారే.. ఇన్నేళ్ల చీకటి గుండెల్లో.. వర్ణాల వెన్నెల నింపారే..' అంటూ సాగిన ఈ గీతానికి రథన్ స్వరాలు సమకూర్చారు. 'సరదాగా కాసేపైనా.. సరిజోడై నీతో ఉన్నా.. సరిపోదా నాకీ జన్మకీ.. చిరునవ్వే ఓ సారైనా.. చిగురించా లోకంలోనా.. ఇది చాల్లే ఇపుడీ కొమ్మకీ' అంటూ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌ అందమైన సాహిత్యం అందించారు. కార్తీక్‌ - పూర్ణిమ కలిసి ఆలపించిన ఈ వినసొంపుగా సాగుతూ శ్రోతలను అలరిస్తోంది. ఈ రొమాంటిక్ కూల్ మెలోడి సాంగ్ నివేదా - విశ్వక్ సేన్ లపై చిత్రీకరించారు. దీనికి మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'పాగల్' చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.