Begin typing your search above and press return to search.

పీకే ఇంత శ్ర‌ద్ధ‌గా ఏం వింటున్నారు?

By:  Tupaki Desk   |   21 Feb 2020 4:18 AM GMT
పీకే ఇంత శ్ర‌ద్ధ‌గా ఏం వింటున్నారు?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు ప‌డ‌వ‌ల ప‌య‌నం గురించి తెలిసిందే. రోజును రెండుగా విభ‌జించి పాలిస్తున్నారు. ఒక కాల్షీట్ సినిమాల‌కు.. ఇంకో కాల్షీట్ రాజ‌కీయాల‌కు కేటాయించారు. ఒకే రోజులో రెండు ఉద్యోగాలు చేస్తూ 50 ప్ల‌స్ వ‌య‌సులో ఆయ‌న చేస్తున్న సాహ‌సం అభిమానుల‌కే షాకిస్తోంది. ఇక జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్ని విస్త‌రిస్తూనే.. అమ‌రావ‌తి కోసం పోరాడుతూనే ప‌వ‌న్ మ‌రోవైపు వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా నాలుగైదు సినిమాల‌కు క‌స‌ర‌త్తు చేయ‌డం అంతే బిగ్ స‌ర్ ప్రైజ్.

పింక్ రీమేక్ లాయ‌ర్ సాబ్ స‌హా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోని పీఎస్ పీకే 27 శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్స్ షూటింగుల్లో పాల్గొన్నారు ప‌వ‌న్. మ‌ధ్య‌లో చిన్న పాటి గ్యాప్ కూడా తీసుకుని అటు దిల్లీ టు గ‌ల్లీ రాజ‌కీయాల్ని న‌డిపిస్తున్నారు. ఇంత బిజీలోనూ ప‌వ‌న్ ఇదిగో ఇలా కెమెరా కంటికి చిక్కారు.

హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నారు. అలా వింటూనే ఇలా ఏదో త‌న్మ‌య‌త్మంలోకి వెళ్లిపోయారు. ఆ ప‌క్క‌నే అనూప్ రూబెన్స్ అంతే అటెన్ష‌న్ తో క‌నిపిస్తున్నాడు. ఇంత‌కీ ఏ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ అనుకుంటున్నారా? అస‌లు సినిమాల‌కు దీనికి ఏమాత్రం సంబంధం లేదు. మార్చి 14 జ‌న‌సేన పార్టీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం. అందుకే జ‌న‌సేన కోసం పాట రాసి కంపోజ్ చేయించార‌ట‌. ఆ పాట‌నే వింటున్నారిలా. ఆ రోజంతా జ‌న‌సైనికుల గుండెల్లో స్ఫూర్తిని ర‌గిలిస్తూనే ప్ర‌జ‌ల్లోకి ఈ పాట దూసుకు వెళ్ల‌నుంద‌ట‌. అన్న‌ట్టు ఈ పాట‌లో అధికార ప‌క్షంపై తూటాలేం పేలుస్తారోన‌న్న చ‌ర్చా సాగుతోంది.