Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ విషెస్ వెన‌క అంత క‌థ ఉందా?

By:  Tupaki Desk   |   14 Jan 2020 5:30 PM GMT
ప‌వ‌న్ విషెస్ వెన‌క అంత క‌థ ఉందా?
X
కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఒక‌రు.. ఊహించ‌ని డిజాస్ట‌ర్ త‌ర్వాత ఇంకొక‌రు కోలుకునే విజ‌యాలు అందుకున్నారు. ఈ రెండు విజ‌యాల‌తో మెగా ఫ్యామిలీ మాంచి జోష్ మీద ఉంది. మెగా హీరోల్లో సిస‌లైన‌ పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అందుకేనేమో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత‌టి వాడే స్పందించాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... సుప్రీమ్ హీరో సాయితేజ్ ల‌కు ప‌వ‌ర్ స్టార్ ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ ఇద్ద‌రి సినిమాలు మంచి స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో పుష్ఫ గుచ్చాలు పంపించి ప‌వ‌న్ విషెస్ తెలియ‌జేసారు. బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో స‌క్రాంతి కానుక‌గా రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుని దిగ్విజ‌యంగా థియేట‌ర్ల‌ల‌లో న‌డుస్తోంది. ఇక మేన‌ల్లుడు సాయితేజ్ న‌టించిన `ప్ర‌తి రోజూ పండ‌గే` డిసెంబ‌ర్ లో రిలీజై డీసెంట్ హిట్ అందుకున్న‌ సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో సాయితేజ్ మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. చిత్రల‌హ‌రి త‌ర్వాత సాయితేజ్ కు హుషారు పెంచిన విజ‌యమిది. అందుకే ప‌వ‌ర్ స్టార్ బ‌న్నీ..సాయితేజ్ ల‌కు ఒకేసారి భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. డ‌బులు ధ‌మ‌కా విషెస్ మెగా ఫ్యాన్స్ లోనూ జోష్ పెంచింది. అలాగే ఇరువురిని ఉద్దేశించి ప‌వ‌న్ ఓ లేఖ కూడా రాసారు. ఈ మూవ్ మెంట్ తో ప‌వ‌న్ సినిమాలపై ఆస‌క్తిగానే ఉన్నార‌ని సిగ్న‌ల్ అందిన‌ట్టేన‌న్న భావనా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది కేవ‌లం విషెస్ సీజ‌న్ మాత్ర‌మే కాదు.. రీఎంట్రీ సీజ‌న్.. అందుకే ప‌వ‌న్ ఫ్రీక్వెంట్ గా స్పందిస్తున్నార‌న్న టాక్ ఫీవ‌ర్ రాజేస్తోంది.

ఇప్ప‌టికే ప‌వ‌న్ బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు ఖ‌రారైంది. ఈ సినిమాకు ప‌వ‌న్ 50 కోట్లు పారితోషికం అందుకుంటున్న‌ట్లు ప్ర‌చార‌మ‌వుతోంది. ర‌న్నింగ్ సినిమాల‌తో రేస్ లో లేక‌పోయినా.. ప‌వ‌న్ కి జ‌నాల్లో ఇంకా ఇమేజ్ రెట్టింపు అయిందే కానీ.. ఏ మాత్రం డౌన్ అవ్వ‌లేద‌ని ఫ్యాన్స్ జోష్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. తాజాగా బ‌న్నీ..సాయి తేజ్ ల‌ కు చెప్పిన విషెస్ చెప్ప‌డంతో మ‌రోమారు ప‌వ‌ర్ స్టార్ ఈజ్ బ్యాక్ .. ముఖానికి రంగేసుకోవ‌డం ఖాయం అంటూ సోష‌ల్ మీడియాల్లో హుషారైన ప్ర‌చారం మొద‌లైపోయింది. ఇక ప‌వ‌న్ రీఎంట్రీకి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.