Begin typing your search above and press return to search.

లేటు వ‌యసులో వ‌హ్వా అనిపిస్తున్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

By:  Tupaki Desk   |   20 Aug 2020 11:30 PM GMT
లేటు వ‌యసులో వ‌హ్వా అనిపిస్తున్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి
X
ఇటీవ‌లి కాలంలో లేటు వ‌య‌సు ఘాటు వ్య‌వ‌హారాలు సోష‌ల్ మీడియా సాక్షిగా బ‌య‌ట‌ప‌డుతుంటే వాటికి కొంటె కుర్రాళ్ల కామెంట్లు అంతే ఇదిగా వేడెక్కిస్తున్నాయి. 40 ఏజ్ కి చేరువ‌లో ఉన్న అమీషా ప‌టేల్.. శిల్పాశెట్టి.. ప్రీతిజింతా లాంటి భామ‌లు నిత్యం ఏవో వేడెక్కించే ఫోటోల‌తో అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తూనే ఉన్నారు.

తాజాగా సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ప్రీతిజింతా అదిరిపోయే ఫోజును ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో ప్ర‌స్తుతం కుర్ర‌కారులో హాట్ టాపిక్ గా మారింది. న‌వ్వ‌కుండానే అలా బుగ్గ‌ల్లో సొట్ట‌లు ప‌డిపోతుంటే.. అస‌లు ఆ డిజైన‌ర్ డ్రెస్ క‌ల‌ర్ కాంబినేష‌న్ అద‌ర‌హో అనేలా ఉంది అంటూ పొగిడేస్తున్నారు. బిగి స‌డ‌ల‌ని బ‌రువుల‌తో జింతాత జితాత అంటూ ఏమిటా ఫోజు? అంటూ ఒక‌టే ఇదైపోతున్నారు.

ఇంత‌కీ ఈ ఫోటోషూట్ ఎక్క‌డ చేశారు? అంటే వెర్సాస్ ఫోటోషూట్ అంటూ స్పందించింది ప్రీతి. హ్యూట్ 24 లైవ్ అనే బ్రాండెడ్ ఫ్యాష‌న్ గార్మెంట్స్.. అలానే సౌంద‌ర్య సాధ‌క ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఎంపికైంది. అందుకే ఈ హ‌డావుడి. కెకెఆర్ టీమ్ తో బిజినెస్ ఉండీ.. ఐపీఎల్ లో ప్రీతి హ‌డావుడి లేక‌పోతే ఏదో అయిపోతున్నారు కుర్రాళ్లు. అస‌లు మాయ‌దారి మ‌హ‌మ్మారీ ఇలా నాశ‌నం చేసింది కానీ లేదంటే ఐపీఎల్ పేరుతో ఇలాంటి సీనియ‌ర్ బ్యూటీస్ స్టేడియంలో ఉర‌క‌లెత్తిస్తుంటే ఆ మ‌జానే వేరుగా ఉంటుంది.