Begin typing your search above and press return to search.

ఇష్టం లేదనొచ్చుగా సాకులు చెప్పడం ఎందుకు?

By:  Tupaki Desk   |   27 Feb 2020 7:45 AM GMT
ఇష్టం లేదనొచ్చుగా సాకులు చెప్పడం ఎందుకు?
X
భారతీయ సాంప్రదాయంలో చీర ఒక భాగం. ఇండియన్‌ స్త్రీలు కట్టుకునే తరహా చీరలు మరెక్కడ ఉండవు. కాని ఈమద్య కాలంలో ఇండియన్స్‌ చీరలు కట్టుకోవడం చాలా తక్కువ అయ్యింది. ముఖ్యంగా సెలబ్రెటీలు తమ కెరీర్‌ మొత్తంలో కూడా కొన్ని సార్లు మాత్రమే చీరలు కట్టుకుని కనిపిస్తున్నారు. చీర ఎందుకు కట్టుకోవడం లేదు అంటే ఏదో ఒక కారణం చెబుతూ ఉంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటూ నెటిజన్స్‌ మండి పడుతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చీరల గురించి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో తనకు చీరలు అంటే చాలా ఇష్టం అని.. కాని చీరలు కట్టుకోవడం మాత్రం తన వల్ల కాదు అంది. చీర కట్టుకుంటే అది ఎప్పుడు ఎక్కడ ఊడిపోతుందో అనే భయం నన్ను వేదిస్తూ ఉంటుంది. చీర కట్టుకున్న ప్రతి సారి నేను పడే టెన్షన్‌ అంతా ఇంతా కాదు. అందుకే చీర కట్టుకోవడం అంటేనే నాకు భయంగా ఉంటుందని పూజా చెప్పుకొచ్చింది.

చీర కట్టుకునే వారు అందరు ఎలా కట్టుకుంటున్నారు. కట్టుకునే విధంగా కట్టుకుంటే ఎందుకు ఊడిపోతుంది. ప్రస్తుతం కట్టుకునే వారివి అందరివి ఏమైనా ఊడుతున్నాయా అంటూ నెటిజన్స్‌ ఆమె వీడియోకు కామెంట్స్‌ చేస్తున్నారు. చీర అంటే ఇష్టం లేదని డైరెక్ట్‌ గా చెప్పకుండా ఊడుతుంది.. పరువు పోతుందని సాకులు చెప్పడం ఎందుకు అంటూ నెటిజన్స్‌ ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు.