Begin typing your search above and press return to search.
కనికా ఒక కరోనా క్రిమినల్: పూనమ్ కౌర్
By: Tupaki Desk | 21 March 2020 7:20 AM GMTకరోనా బారినపడి దేశవ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్. దేశమంతా కరోనా నుండి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే కనికా మాత్రం లండన్ నుండి కరోనాను వెంట తెచ్చుకుంది. కనికాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా అవాక్కవ్వాల్సిన విషయమిది.. ఒక సెలబ్రిటీ అయి ఉండి బాధ్యత రహితంగా విమానాశ్రయంలో ఆమె చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
గతవారం లండన్ నుండి వచ్చిన కనికా, ఎయిర్ పోర్టులో తన ట్రావెల్ హిస్టరీని దాచేసి కరోనా టెస్టులు చేయించుకోకుండా తప్పించుకుని ఫ్యామిలీ పార్టీలో హాజరైంది. ఆ పార్టీ అనంతరం కనికాను పరీక్షించిన వైద్యులు కరోనా పాసిటివ్ అని తేల్చేసి, లక్నో హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కనికా కపూర్ పై నటి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా మండిపడింది. "ఎంత డబ్బు, పలుకుబడి ఉంటే మాత్రం ఇలా బాధ్యత లేకుండా చేస్తారా.? అందరి కన్నుగప్పి తప్పించుకున్నందుకు ఆమె ఒక క్రిమినల్" అన్నట్లు వివాదాస్పదంగా స్పందించింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.