Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కమెడియన్ కు వైరస్? నిజమెంత?
By: Tupaki Desk | 9 Jun 2020 6:15 AM GMTదేశంలో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో అయితే విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ లో కంట్రోల్ లో ఉన్న వైరస్ ఇప్పుడు నిబంధనలు సడలించడంతో విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
తాజాగా హైదరాబాద్ కు చెందిన కమెడియన్ కూడా ఈ మహమ్మారి సోకినట్టుగా ప్రచారం సాగుతోంది. హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్బర్ బిన్ తబర్ కూడా కరోనా బారిన పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. అధికారికంగా కూడా స్పందించలేదు అక్బర్.
కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘పైసా’లో అక్బర్ నటించాడు. లోకల్ హిందీ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు.
కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అక్బర్ ను ఆస్పత్రిలో చేర్పించగా.. కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అక్బర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం అక్బర్ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆస్పత్రి వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.గత వారం హైదరాబాద్ లోని తన స్నేహితులను కలిసి వచ్చిన అక్బర్ అనంతరం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.